తమిళసినిమా: నటి సన్నిలియోన్ అనగానే గ్లామర్ బాంబ్‌గానే అందరూ భావిస్తారు. అయితే ఈ బ్యూటీ అలాంటి ఇమేజ్‌కు ఇక టాటా చెప్పాలని నిర్ణయించుకుందట. అసలు విషయానికి వస్తే సన్నిలియోన్ తొలిసారిగా కోలీవుడ్‌లో చారిత్రాత్మక కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. దర్శకుడు వీసీ.వడివుడైయాన్ ఈ బ్యూటీని దక్షిణాదికి నాయకిగా పరిచయం చేయనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని నవ నిర్మాత పోన్స్ స్టీఫెన్ తన స్టీవ్స్ కార్నర్ పతాకంపై భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కథా చిత్రంలో సన్నిలియోన్‌కు కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీలు, యాక్షన్ సన్నివేశాలు భారీగా చోటు చేసుకుంటాయని చిత్ర వర్గాలు తెలిపాయి.
అందుకోసం సన్నిలి యోన్ కత్తి పోరాటం, గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతోందట. ఆంధ్రా నుంచి ప్రత్యేకంగా శిక్షకుడిని ముంబై పిలిపించుకుని విలు విద్యల్లో తర్ఫీదు పొందుతోందట. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. నటుడు నాజర్, నవదీప్‌లతో పాటు ఒక ప్రముఖ నటుడు ప్రధాన పాత్ర పోషించనున్నారు. దీన్ని తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలన్నది తన కోరిక అని, ఇలాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని సన్నిలియోన్ వెల్లడించింది. ఈ చిత్రంతో తన గ్లామర్ ఇమేజ్ పూర్తిగా మారిపోతుందనే నమ్మకం వ్యక్తం చేస్తోంది.
యాక్షన్ వైపు సన్నిలియోన్
Published Tue, Dec 5 2017 1:13 AM | Last Updated on Tue, Dec 5 2017 1:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment