యూట్యూబ్లో కరీనా ఐటెం సాంగ్ | Akshay kumar shares teaser of Kareena item song from 'Brothers' | Sakshi

యూట్యూబ్లో కరీనా ఐటెం సాంగ్

Published Mon, Jul 6 2015 3:13 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

యూట్యూబ్లో కరీనా ఐటెం సాంగ్

యూట్యూబ్లో కరీనా ఐటెం సాంగ్

'మేరా నామ్ మేరీ' అంటూ వెండిరంగు దుస్తులతో కరీనా కపూర్ ఖాన్ హొయలొలికించిన పాట టీజర్ యూట్యూబ్లో విడుదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న 'బ్రదర్స్' సినిమా కోసం ఈ పాటలో కరీనా నర్తించింది. ఇంతకుముందు కూడా కరీనా కొన్ని ఐటెం సాంగ్స్లో మెరిసి మురిపించిన విషయం తెలిసిందే. తాజాగా మేరీ ఐటెం సాంగ్ టీజర్ను హీరో అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానుల కోసం షేర్ చేశాడు.

30 సెకండ్ల పాటు ఉన్న ఈ టీజర్లో ఎక్కడా కరీనా ముఖం కనపడదు. వీపు భాగం మాత్రమే కనిపిస్తుంది. ''బ్రదర్స్ 2015 సినిమా కోసం మేరానామ్ మేరీ పాట ఎక్స్క్లూజివ్ టీజర్ మీకోసం అందిస్తున్నా.. ఎంజాయ్ చెయ్యండి'' అని అక్షయ్ ట్వీట్ చేశాడు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన బ్రదర్స్ సినిమా.. 2011లో విడుదలైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'వారియర్' సినిమాకు రీమేక్. ఇందులో సిద్దార్థ మల్హోత్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement