Sreeleela Special Song In Vijay Goat Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్‌ సాంగ్‌?

Published Fri, Apr 26 2024 5:52 PM | Last Updated on Fri, Apr 26 2024 6:01 PM

Sreeleela Special Song In Vijay Goat Movie - Sakshi

దర్శకుడు వెంకట్‌ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి.  ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్‌ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్‌ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్‌. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్‌ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్‌ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ, మైక్‌ మోహన్‌ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. గోట్‌ చిత్రాన్ని సెప్టెంబర్‌ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాల సమాచారం.

కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్‌ అప్పీరియన్స్‌ను ఇవ్వడానికి టాలీవుడ్‌ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ చిత్రం గోట్‌నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్‌స్టార్‌ అజిత్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్‌పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్‌ ఎలా ఉండబోతోందో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement