భారీ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట | Sreeleela Refuse Special Song In The GOAT | Sakshi
Sakshi News home page

Sreeleela Refuse : ఆ ఆఫర్‌ను రిజెక్ట్‌ శ్రీలీల.. బ్రిలియంట్‌ డెసిషన్‌ అంటూ ప్రశంసలు!

May 4 2024 11:00 AM | Updated on May 4 2024 12:25 PM

Sreeleela Refuse Special Song In The GOAT

టాలీవుడ్‌లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్‌ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్‌ కూడా దొర్లాయి.

అయితే రవితేజ సరసన నటించిన  ఢమాకా చిత్రం హిట్‌ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్‌ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్‌ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్‌తో స్పెషల్‌ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది.

విజయ్‌ ప్రస్తుతం గోట్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్‌ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్‌ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్‌ సాంగ్‌ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.

ఆ తరువాత కాల్‌ షీట్స్‌ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్‌ యువ స్టార్‌ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్‌లో సింగిల్‌ సాంగ్‌తో ఎంట్రీ అయితే అది కెరీర్‌ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్‌ డెసిషన్‌ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్‌ హీరో అజిత్‌ సరసన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement