
Katrina Kaif Item Song In Salaar: ఐటమ్ సాంగ్ లేని సినిమాలు దాదాపు ఉండటంలేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఒక స్పెషల్ సాంగ్‌ని ఫ్యాన్స్ ఆశిస్తారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చర్చ అంతా ఈ హీరో చేస్తున్న ‘సలార్’ సినిమా గురించే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటను భారీగా ప్లాన్ చేస్తున్నారనే వార్త వచ్చింది.
అంతేకాదు.. ఇది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ పాటలో ప్రభాస్‌తో కలసి ఓ హిందీ హీరోయిన్ స్టెప్పులేస్తే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఆ బ్యూటీ ఎవరో కాదు.. కత్రినా కైఫ్ అని సమాచారం. కత్రినా డ్యాన్స్ ఎంత బాగుంటుందో చెప్పడానికి ఆమె చేసిన ప్రత్యేక పాటల్లో ఒకటైన ‘చిక్‌నీ చమేలీ..’ చాలు. ‘అగ్నిపథ్’లోని ఈ పాటలో కత్రినా స్టెప్స్ అదుర్స్. మరి... ‘సలార్’లో స్పెషల్ సాంగ్ ఉంటుందా? ఉంటే అందులో కత్రినానే నటిస్తారా? అనేది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment