
హీరోయిన్ సమంత తొలిసారిగా చేసిన స్పెషల్ సాంగ్ వివాదాస్పదమైంది. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాటలో సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇటీవలె విడుదలైన ఈ పాట ఇప్పటికే మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తుంది. చదవండి: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆ వార్తలపై క్లారిటీ..
ఇదిలా ఉండగా 'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ సాగిన ఈ సాంగ్ లిరిక్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మగవాళ్లపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఈ పాట ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. పుష్ప టీంతో పాటు పాటలో నర్తించిన సమంతపై కూడా పురుషుల సంఘం కేసుపెట్టింది. పాటపై నిషేధం విధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.
కాగా ఈ పాట థియేటర్స్‌లో వేరే లెవల్‌లో ఉంటుందని ఇప్పటికే అల్లు అర్జున్ 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సైతం పేర్కొన్నారు.మరోవైపు సమంత తొలిసారిగా స్పెషల్ సాంగ్‌లో కనిపించడంతో ఈ పాటపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న విడుదల కానుంది. చదవండి: భార్య కోసం పాట పాడిన దిల్‌రాజు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment