Youtube Breaking Records Of Samantha Oo Antava Oo Antava Song In Pushpa - Sakshi
Sakshi News home page

Samantha: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న సమంత స్పెషల్‌ సాంగ్‌

Published Wed, Dec 15 2021 1:38 PM | Last Updated on Mon, Dec 20 2021 11:47 AM

Youtube Records Of Samantha Oo Antava Oo Antava Song In Pushpa - Sakshi

Youtube Records Of Samantha Oo Antava Oo Antava Song In Pushpa: ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పుష్ప' మ్యానియా కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సమంత తొలిసారిగా ఐటెం సాంగ్‌ చేయడంతో మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట అంటూ సమంత చేసిన ఈ సాంగ్‌ యూట్యూబ్‌ను దుమ్మురేపుతుంది. సమంత గ్లామర్‌, చంద్రబోస్‌ లిరిక్స్‌ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావ‌తి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.చదవండి: నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు చేయను: నాగ చైతన్య

తాజాగా అన్ని భాషల్లో కలుపుకొని ఈ పాటకి 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాకుండా 1.6మిలియన్స్‌కి పైగా లైక్స్‌ వచ్చాయి. థియేటర్స్‌లో ఈ సాంగ్‌ మరింత సందడి చేయడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా సమంత పర్‌ఫార్మెన్స్‌కి బొమ్మ దద్దరిల్లుతుందని మేకర్స్‌ భావిస్తున్నారు. కాగా సినిమాలో ఇంటర్వెల్‌కి ముందుగానే ఈ సాంగ్‌ సందడి చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. 

చదవండి: సమంత ఐటెం సాంగ్‌కి చిందేసిన బోల్డ్‌ బ్యూటీ అరియానా
నాగ చైతన్య బెస్ట్‌ఫ్రెండ్‌కి బర్త్‌డే విషెస్‌ చెప్పిన సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement