'పుష్ప' ఐటమ్ సాంగ్.. ఒకరు కాదు ఇద్దరు! | Pushpa Item Song: Allu Arjun To Dance With Samantha And Sreeleela | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: 'పుష్ప' హంగామా.. ఈసారి హాట్ బ్యూటీస్‌తో?

Published Sat, Nov 2 2024 10:50 AM | Last Updated on Sat, Nov 2 2024 11:00 AM

Pushpa Item Song: Allu Arjun To Dance With Samantha And Sreeleela

మరో నెల రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ ఉంది. కానీ ఇప్పటికే షూటింగ్ పెండింగ్‌లోనే ఉంది. దాదాపు చిత్రీకరణ అంతా పూర్తయినప్పటికీ ఐటమ్ సాంగ్ కోసం సరైన బ్యూటీ దొరక్క దాన్ని అలా పక్కనబెట్టేశారు. తొలి భాగంలో 'ఊ అంటావా మావ' అని సమంత కేక పుట్టించగా..  ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అనేది భేతాళ ప్రశ్నగా మారిపోయింది. అయితే ఈసారి ఇద్దరు బ్యూటీస్‌తో పుష్పరాజ్ స్టెప్పులు వేయనున్నాడట.

తొలి భాగంలో సమంత తనదైన హస్కీ మూమెంట్స్‌తో రచ్చ లేపింది. చేస్తే గీస్తే 'పుష్ప 2'లో అంతకుమించి ఉండాలి తప్పితే తగ్గకూడదనేది టీమ్ ప్లాన్. అందుకే తృప్తి దిమ్రి, శ్రద్ధా దాస్.. ఇలా చాలామంది బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు వినిపించాయి. అన్నీ సెట్ అవుతున్నా రెమ్యునరేషన్ దగ్గర తేడాలొస్తున్నాయట. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి మన హీరోయిన్ల దగ్గర మేటర్ ఆగిందట.

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలీరెడ్డి)

మొన్నటివరకు శ్రద్ధా కపూర్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఈసారి ఐటమ్ సాంగ్‌లో సమంత-శ్రీలీల.. ఇద్దరు పుష్పరాజ్‌తో రచ్చ లేపేందుకు రెడీ అయిపోయారట. మరి ఒకరు కాదు ఇద్దరు అనేది నిజమా లేదా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుందిలే!

అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్ నటిస్తున్న 'పుష్ప 2'.. వచ్చే నెల అంటే డిసెంబరు 5న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్.. మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని హైప్ ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దీంతో సినిమాపై రూ.1000 కోట్ల అంచనాలు ఉన్నాయి. మరి 'పుష్ప 2' ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement