
స్వింగ్ జర స్వింగ్ జర... స్వింగ్ స్వింగ్ అంటూ తమన్నా ఆ మధ్య ‘జై లవ కుశ’లో చేసిన ఐటమ్ సాంగ్ గుర్తుండే ఉంటుంది. థియేటర్లో ఫ్యాన్స్ ఊగిపోయారు. తమన్నా అంత బాగా డ్యాన్స్ చేశారు. అంతకుముందు ‘అల్లుడు శీను’లో ‘లబ్బర్ బొమ్మ..’, ‘స్పీడున్నోడు’లో ‘బ్యాచిలర్ బాబు..’ అంటూ ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కూ మంచి స్పందన వచ్చింది. ఇంతేనా కన్నడ ‘జాగ్వార్’లోనూ ఓ ఐటమ్ సాంగ్‌కి కాలు కదిపి, శాండిల్‌వుడ్‌నీ తన ఆటతో కట్టిపడేశారు. ఇప్పుడు మరోసారి కన్నడ ప్రేక్షకులకు ఐ–ఫీస్ట్ లాంటి ఐటమ్ సాంగ్‌లో కనిపించనున్నారు తమన్నా. అన్నట్లు.. రీసెంట్‌గా నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాలో ఫేమస్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు’లో నర్తించడానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’లో స్పెషల్ సాంగ్ గురించి చెప్పాలంటే.. నవీన్ కుమార్, శ్రీనిధి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహి స్తున్నారు. ఇందులో తమన్నా చేయబోయే స్పెషల్ సాంగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ 1970లో నటించిన కన్నడ చిత్రం ‘పరోపకారి’ సినిమాలోని ‘జోకే నన్ను బలియా మించు’ సాంగ్ రీమిక్స్‌లో తమన్నా నటించబోతున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. అదండీ సంగతి. తమన్నాకి ఇక్కడ కూడా క్రేజ్ ఉంది కదా అందుకే.. స్పెషల్ సాంగ్ చేయించి ఉంటారు. మొత్తంగా హీరోయిన్‌గా, స్పెషల్‌గాళ్‌గా తమన్నా కెరీర్ ఫుల్ స్వీంగ్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment