
Samantha Oo Antava.. Oo Oo Antava Lyrical Song Out: సమంత.. ఈ పేరు చెప్తేనే కుర్రకారు హుషారెత్తిపోతారు. ఆమె నటనకు, క్యూట్ లుక్స్‌కు ఫిదా కాని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో! తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించుకున్న సామ్ మొట్టమొదటి సారిగా ఐటం సాంగ్‌లో నటించింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ పుష్పలో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' స్పెషల్ సాంగ్‌లో అలరించింది. 'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ సాగిన ఈ సాంగ్ లిరికల్ వీడియో శుక్రవారం సాయంత్రం రిలీజైంది.
ఈ పాటలో లంగా జాకెట్‌లో కనిపించిన సమంత తన అందచందాలను ఆరబోస్తూ మరోసారి ఫిదా చేసింది. కాగా ఇప్పటివరకు కెరీర్‌లో ఒక్కసారి కూడా స్పెషల్ సాంగ్స్ చేయని సామ్ మొదటిసారిగా బన్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. దీంతో పుష్ప సినిమాకు సమంత, ఈ స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment