కన్నడంలో సన్నీ ఐటం సాంగ్! | Sunny Leone shoots item number for 'DK' | Sakshi
Sakshi News home page

కన్నడంలో సన్నీ ఐటం సాంగ్!

Published Tue, Aug 5 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

కన్నడంలో సన్నీ ఐటం సాంగ్!

కన్నడంలో సన్నీ ఐటం సాంగ్!

బాలీవుడ్‌ను కిర్రెక్కిస్తున్న సన్నీ లియోన్ తెలుగు, తమిళ సినిమాల్లోనూ ఐటం సాంగ్‌లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె కన్నడ రంగంలోనూ కాలు మోపుతోంది. కన్నడ చిత్రం ‘డీకే’ కోసం ‘శేషమ్మ శేషమ్మ’ అనే ఐటం సాంగ్‌లో అందాలను ఆరబోస్తోంది. మూడు రోజులుగా ఈ ఐటం సాంగ్ షూటింగ్‌లో సన్నీ బిజీబిజీగా ఉంటోంది. ఒకటి రెండు రోజుల్లో ఐటం సాంగ్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ‘డీకే’ చిత్ర బృందం తెలిపింది.
 

హాలీవుడ్ చాన్స్ కొట్టేసిన జూహీ
జూహీ చావ్లా హాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. లాసే హాల్‌స్ట్రోమ్ దర్శకత్వంలో స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్మించనున్న చిత్రంలో జూహీ వృద్ధ మహిళ పాత్ర పోషించనుంది. ఇందులో జూహీ భర్తగా బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి నటించనున్నాడు. స్పీల్‌బర్గ్ చిత్రంలో తన పాత్ర చిన్నదే అయినా, కీలకమైనదని జూహీ చెప్పింది.
 
 ‘ముంబై సాగా’లో హుమా ఖురేషీ
 ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన హుమా ఖురేషీకి తాజాగా ‘ముంబై సాగా’లో హీరోయిన్ పాత్ర లభించింది. సంజయ్ గుప్తా రూపొందిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహాం హీరోగా నటించనున్నాడు. మాఫియా ముఠాలకు, రాజకీయ నేతలకు, పోలీసులకు గల పరస్పర సంబంధాల ఆధారంగా రూపొందించుకున్న కథతో సంజయ్ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement