శ్రీయకు మళ్లీ చాన్స్ | chance comes again Actress Shriya | Sakshi
Sakshi News home page

శ్రీయకు మళ్లీ చాన్స్

Published Mon, Feb 15 2016 3:28 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

శ్రీయకు మళ్లీ చాన్స్ - Sakshi

శ్రీయకు మళ్లీ చాన్స్

నటి శ్రీయ ఒకప్పటి క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీ ఉనక్కు 20 ఎనక్కు18 చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ఉత్తరాది అమ్మడు ఆ తరువాత మళై, తిరువిళైయాడల్ ఆరంభం, అళగీయ తమిళమగన్, శివాజీ చిత్రాల్లో నటించింది. అలా సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి విజయ్, ధనుష్, జయంరవి లాంటి ప్రముఖ నటులకు జంటగా నటించి క్రేజ్ సంపాదించుకున్న శ్రీయ ఆ తరువాత ఇంద్రలోకత్తిల్ నా అళగప్పన్ చిత్రంలో హస్య నటుడు వడివేల్‌తో ఐటమ్ సాంగ్ చేయడంతో ఆమె ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది.

అజిత్ తదితర స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వెనక్కుపోయాయి.దీంతో తెలుగు చిత్రాలపైనే ఆశ పెట్టుకున్న శ్రీయ అక్కడ కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే రావడంతో నటిగా వెనకపడిపోయిందనే చెప్పాలి. మొదటి నుంచి గ్లామర్‌నే నమ్ముకున్న శ్రీయ నటనకు అవకాశం ఉన్న పాత్రలపై మక్కువ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ మధ్య పవిత్ర అనే తెలుగు చిత్రంలో వేశ్యగా నటించి ఒక సంచలనం సృష్టించాలని ప్రయత్నించింది.అది బెడిసికొట్టింది.

అదే విధంగా కన్నడంలో చంద్రా అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఆ మధ్య తెలుగులో నాగార్జునతో నటించిన మనం చిత్రం మంచి విజయాన్నే సాధించింది.అయితే అందులో సమంత కూడా ఒక హీరోయిన్ కావడంతో శ్రీయకు పెద్దగా ప్లస్ కాలేదనే చెప్పాలి. మొత్తం మీద ఇటు తమిళంలోగానీ అటు తెలుగులో గానీ అవకాశాలు లేని శ్రీయకు తాజాగా కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చిందన్నది సమాచారం. అయితే అది హీరోయిన్ పాత్ర కాదు.

మంచి మెచ్యూరిటీ గల ప్రౌఢ పాత్ర అని తెలిసింది. నవ నటుడు కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఏదేమైనా నటి శ్రీయ క్యారెక్టర్ నటిగా మారిపోయినట్లు తెలుస్తోంది. రమ్యక్రిష్ణలా శ్రీయ కూడా ఈ తరహా పాత్రల్లో ఒక రౌండ్ చుట్టేస్తుందే లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement