అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2: ది రూల్ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.
అయితే వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ఐటమ్ సాంగ్స్ తనకు నచ్చవని సరదాగా కామెంట్స్ చేశారు.
సుకుమార్ మాట్లాడుతూ.. 'ఐటమ్ సాంగ్ నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. 'అల్లుగారి పిల్లగాడా' అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లుగారి అబ్బాయి కాదు' అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్‌ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్‌ను పటగొట్టేస్తాడు . ఆర్యకు బైక్ కూడా లేదు.. చాలా పూర్. కేవలం సైకిల్ మాత్రమే ఉంది అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా?.. ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్‌లోకి వచ్చేశాను. కానీ దిల్ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment