
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో నటించారు. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు.
ఈ చిత్రంలోని ‘ఛాంగురే ఐటమ్ సాంగురే...’ అంటూ సాగే పాటను హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ గురువారం విడుదలచేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను సోమవారం విడుదల చేశారు. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. మంగ్లీ, సాయికార్తీక్, దత్తు ఆలపించారు. సందీప్, స్నేహా గుప్తాలతో డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ హుషారైన స్టెప్పులు వేయించారని ప్రోమో చూస్తే తెలుస్తోంది. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తీక్.
Comments
Please login to add a commentAdd a comment