Samantha Item Song: Do You Know About Singer Indravati Chauhan - Sakshi
Sakshi News home page

Pushpa Movie: సమంత ఐటమ్‌ సాంగ్‌ పాడిన సింగర్‌.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా!

Published Fri, Dec 10 2021 7:45 PM | Last Updated on Fri, Dec 10 2021 8:40 PM

Samantha Item Song: Do You Know About Folk Singer Mangli Sister Indravati Chauhan - Sakshi

Did You Know Singer Who Sing Item Song From Pushpa Samantha: ఎక్కడ చూసినా ప్రస్తుతం పుష్ప సినిమా హవా నడుస్తోంది. రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్‌, డైలాగులు అభిమానులకు పూనకం తెప్పిస్తున్నాయి. టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక మందన కలిసి నటించిన ఈ సినిమాను సుకుమార్‌ తెరకెకిస్తున్న విషయం తెలసిందే. డిసెంబర్‌ 17న మొదటి భాగం విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్లను వేగం చేసింది చిత్ర యూనిట్‌. 

మూడు పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయడగా.. తాజాగా పుష్ప నుంచి ఐటమ్‌ సాంగ్‌ను ప్రజల్లోకి వదిలింది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత తొలిసారి ఆడిపాడిన ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే ఐటమ్ సాంగ్ లిరికల్ సాంగ్‌ను శుక్రవారం రిలీజ్‌ చేసింది. మత్తు వాయిస్‌తో సాగే ఈ పాటలో సమంత తన మాస్‌ స్టెప్పులతో అదరగొట్టింది. సామ్‌ కాస్ట్యూమ్‌, స్టైల్‌, లుకింగ్‌ అన్నీ పాటకు పర్‌ఫెక్ట్‌ సెట్‌ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి మార్మోగించడంతో సాంగ్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అవుతుందనడంలో సందేహం లేదు.
చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత!

కాగా చంద్రబోస్‌ రాసిన ఈ ఐటమ్‌ పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో మెట్టు ఎక్కించింది. దీంతో ఈ సింగర్‌ ఎవరని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. ఇంద్రావతి చౌహన్‌ ప్రముఖ ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీ  చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాట కూడా పాడారు. అంతేగాక కోటి న్యాయ నిర్ణేతగా ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో కూడా పాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement