
హాస్య నటుడితో ఐటమ్ సాంగ్
ప్రముఖ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం ఇప్పుడు సర్వసాధారణగా మారింది. శ్రుతీహాసన్, తమన్నా వంటి టాప్ కథానాయికలే సింగిల్ సాంగ్స్‌కు రెడీ అంటున్నారు. అలాగే నటి కాదల్ సంధ్య ఐటమ్ సాంగ్స్‌కు పచ్చజెండా ఊపేశారు.తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంధ్య ఆ చిత్రం పేరును తన పేరు ముందు చేర్చుకుని కాదల్ సంధ్యగా మారారు. అలా కథానాయికగా ఎదుగుతున్న సంధ్య కారణాలేమైనా అవకాశాలకు దూరం అయ్యారు. ఇటీవలే మళ్లీ కోలీవుడ్‌లో మెరుస్తున్నారు. అయితే కథానాయికగా కాదు. సహనటిగానో, ఐటమ్ గర్ల్‌గా నో అదీ అప్పుడప్పుడు తెరపై కనిపిస్తున్నారు.
తాజాగా ఈ అమ్మడు కత్తుకుట్టి అనే చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు ఆడారు. అదీ చిత్ర కథానాయకుడితో కాదు. హాస్యనటుడు సూరితో స్టెప్స్ వేశారు. నరేన్ సృష్టి, డాంగే జంటగా నటిస్తున్న చిత్రం కత్తుకుట్టి. ఇది తంజావూర్ జిల్లా డెల్టా రైతుల సమస్యలను ఆవిష్కరించే కథా చిత్రం. కాగా సంధ్య ఐటమ్ సాంగ్ చిత్రానికి హైలైట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ చిత్రంతో సంధ్య ఐటమ్ గర్ల్‌గా మారిపోతారేమో.