Radhe Beauty Disha Patani Excited To Shake Leg With Allu Arjun In Pushpa Movie - Sakshi
Sakshi News home page

బన్నీతో మాస్‌ స్టెప్పులేయనున్న బాలీవుడ్‌ బ్యూటీ!

Published Wed, May 26 2021 6:38 PM | Last Updated on Wed, May 26 2021 9:03 PM

Disha Patani Excited To Shake A Leg With Allu Arjun In Pushpa - Sakshi

క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉండనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరలవుతోంది.

పుష్పలో ఓ ఐటెం సాంగ్‌ ఉండనుందని సమాచారం. బాలీవుడ్‌ భామ దిశా పటానీ ఈ  ఐటైం సాంగ్‌ చేయనుందట. మాస్‌ స్టెప్పులకు బన్నీతో కలిసి డ్యాన్స్‌ చేయనున్నట్లు ఇండస్ర్టీలో టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో  మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ ప్రయత్నిస్తుంది. ఇందులో మొదటి భాగం అక్టోబర్‌లో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట.

చదవండి : 'తగ్గేదే లే'.. అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డు
ఆర్డినరీ హీరోలు ఎక్స్‌ట్రార్డినరీగా.. రష్మిక వీడియో సందేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement