ఐటమ్ సాంగ్స్ అంటే అయిష్టం | i don't like item songs | Sakshi
Sakshi News home page

ఐటమ్ సాంగ్స్ అంటే అయిష్టం

Published Thu, Jul 3 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

ఐటమ్ సాంగ్స్ అంటే అయిష్టం

ఐటమ్ సాంగ్స్ అంటే అయిష్టం

ఐటమ్ సాంగ్‌లంటే తనకు అయిష్టమని ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ పేర్కొన్నారు. ఆయన కుమార్తె పుష్పా కందస్వామి రా జం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ఐం దాం తలైమురై సిద్ధ వైద్దియ శిఖామణి. ఎస్ మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భరత్ హీరోగా నటిస్తున్నారు. ఇది ఈయనకు 25వ చిత్రం కావడం విశేషం. హీరోయిన్‌గా లక్కీగర్ల్ నందిత నటిస్తోంది. ఈ చిత్రంలో 23 మంది హాస్యనటులు నటించడం మరో విశేషం. యువ  దర్శకుడు ఎల్‌జి.రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సైమ న్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నై వడపళనిలోని కమలా థియేటర్‌లో నిర్వహించారు. ఆడియోను దర్శకుడు కె.బాలచందర్ ఆవిష్కరించి తొలి ప్రతిని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కె ఆర్‌కు అందజేశారు. కె.బాలచందర్ మాట్లాడుతూ సాధారణంగా ఐటమ్ సాం గ్స్ అంటే తనకు ఇష్టం ఉండదన్నారు. అలాం టిది ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ చూసిన తనకు ఆడాలనిపించిందని పేర్కొన్నారు. ఈ పాటలో నటించిన నృత్యదర్శకుడు రాబర్ట్‌ను బాలనటుడిగా అళగన్ చిత్రంలో నటింపజేశానన్నారు. అప్పుడే అతనిలోని ఎనర్జీని కనిపెట్టానన్నారు. హీరో భరత్‌లో మంచి నటుడున్నాడని అభినందించారు. చిత్ర టైటిల్ గురించి తన చిన్న సూచ న ఏమిటంటే సిద్ధ వైద్దియ శిఖామణి అని పెట్టి గ్యాగ్‌గా ఐందాం తలైమురై అంటే బాగుండేదన్నారు. చిత్ర పాటలు, ప్రచార చిత్రం చూస్తుం టే దర్శకుడి పనితనం కనిపిస్తోందన్నారు.
 
భరత్‌కు గ్యారెంటీ హిట్
నటుడు భరత్ నటించిన 25వ చిత్రం ఐందాం తలైమురై సిద్ధ వైద్దియ శిఖామణిని రూపొం దడం ఆయన అదృష్టంగా భావిస్తున్నట్లు దర్శకుడు చరణ్ పేర్కొన్నారు. కె.బాలచందర్ వం టి ప్రఖ్యాత దర్శకుడి సంస్థలో నటించే అవకా శం రావడమే అందుకు కారణమన్నారు. తాను అజిత్ హీరోగా తెరకెక్కించిన అమర్క లం చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందేనన్నారు. అది అజిత్ 25వ చిత్రమని, అదే విధంగా భరత్ 25వ చిత్రమైన ఈ ఐందాం తలైమురై సిద్ధ వైద్దియ శిఖామణి మంచి విజ యం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నల్లికుప్పుస్వామి శెట్టి మాట్లాడుతూ కె.బాలచందర్‌తో తన 62 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళ దర్శక మండలి అధ్యక్షుడు విక్రమన్ భరత్, నందిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement