బాహుబలి రిలీజ్ తరువాత జక్కన్న ప్లాన్స్ | Rajamouli Leaving for Bhutan Holiday Trip | Sakshi
Sakshi News home page

బాహుబలి రిలీజ్ తరువాత జక్కన్న ప్లాన్స్

Published Thu, Apr 27 2017 11:14 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలి రిలీజ్ తరువాత జక్కన్న ప్లాన్స్ - Sakshi

బాహుబలి రిలీజ్ తరువాత జక్కన్న ప్లాన్స్

బాహుబలి సినిమా కోసం ఐదేళ్ల పాటు కష్టపడ్డ రాజమౌళి, త్వరలో లాంగ్ హాలీడే ట్రిప్ కు వెళ్లనున్నాడు. ఈ శుక్రవారం బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా హాలీవుడ్ సినిమాలకు కూడా షాక్ ఇస్తున్న బాహుబలి ఇండియన్స్ సినిమా కలెక్షన్ల రికార్డ్ లను బద్ధలు కొట్టడం కాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇంతటి భారీ చిత్రం తరువాత రాజమౌళి కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారు.

బాహుబలి 2 ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకొని భూటాన్ వెళ్లనున్నాడు. ఆసియాలో సంతోషకరమైన దేశంగా భూటాన్ కు పేరుంది. చాలా రోజులుగా భూటాన్ చూడలనుకుంటున్న జక్కన్న తన హాలీడే ట్రిప్ ను అక్కడే ప్లాన్ చేశారు. అంతేకాదు మహాభారతాన్ని ఇప్పట్లో తెరకెక్కించనన్న రాజమౌళి, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా కథలు సిద్ధం చేశారని, త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తానని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement