
చూతము రారండోయ్!
అక్కడ ‘అభివృద్ధి’ని ఆర్థిక పరిభాషలో కొలవరు. ఆనందానికి సంబంధించిన విషయాలతోనే కొలుస్తారు. అక్కడ ‘జీడిపి’ కంటే ‘జీఎన్‌హెచ్’ (గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్)కే ప్రాధాన్యత ఇస్తారు. భూటాన్ అంటే అందమైన సంతోషం! భూటాన్‌ను చూడడమంటే భూతలస్వర్గ విహారం!!
‘మా అందాలివిగో’ అన్నట్లుగా భూటాన్ ప్రభుత్వం, దేశంలోని దైనందిన జీవితపు సొగసు, కట్టడాలపై కొన్ని ఫోటోలను విడుదల చేసింది.
వాటిని చూస్తే... భూటాన్‌ను చూడని వాళ్లు... ‘‘తప్పక చూడాలి’’ అనుకుంటారు. భూటాన్‌ను చూసిన వాళ్లు, ఫోటోలను కూడా చూస్తే- ‘‘మరోసారి తప్పకచూడాలి’’ అనుకుంటారు. మచ్చుకు రెండు ఫోటోలు...మహాద్భుతం కదూ!