భూటాన్‌తో రక్షణ బంధం!
థింపూ: భూటాన్, భారత్ దేశాల రక్షణ.. పరస్పరం సంక్లిష్టంగా పెనవేసుకుని ఉన్న అంశమని, ఈ రెండు దేశాల రక్షణను వేరువేరుగా చూడడం సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసిం ది. అందువల్ల పరస్పర అందోళనలపై ఇరుదేశాలు సానుకూలంగా స్పందించడం చాలా ముఖ్యమని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అలాగే, తన పర్యటనకు.. భూటా న్, చైనా దేశాల మధ్య జరుగుతున్న సరి హద్దు చర్చలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మూడో దేశ ప్రభావం లేని స్థాయిలో భారత్, భూటాన్ సంబంధాలున్నాయని పేర్కొన్నారు. నూతన శిఖరాలకు చేరగల శక్తి, సామర్ధ్యాలు ఇరుదేశాలకు ఉన్నాయన్నారు.
భూటాన్ పర్యటన సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్, ప్రధాని షెరింగ్ టాబ్గేలతో వేర్వేరుగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. 2003 లో భూటాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదులను తరిమేయడంలో ఆ దేశం చూపిన చొరవను ఈ సందర్భంగా ప్రణబ్ గుర్తుచేశారు. భూటాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే పొరుగుదేశం కాదని ప్రశంసించారు. అలాగే, ఇం డో, భూటాన్ సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న భూటాన్ పౌరులకిడ్నాప్ ఘటనలను తీవ్రంగా తీసుకున్నామని ప్రణబ్ తెలిపారు.
రాష్ట్రపతికి ఘనస్వాగతం
రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భూటాన్ చేరుకున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘన స్వాగతం లభించింది. ప్రొటోకాల్‌ను కూడా కాదని.. స్వయంగా విమానాశ్రయానికి భార్యతో సహా వెళ్లి మరీ.. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్ భారత రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గన పారో విమానాశ్రయానికి 50కిమీల దూరంలో ఉన్న భూటాన్ రాజధాని థింపూకి రాష్ట్రపతి వెళ్లారు. దారి పొడవునా రోడ్డుకిరువైపులా భారత్, భూటాన్ జాతీయ జెండాలు చేతబూనిన విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. థింపూలో సైనిక వందనం స్వీకరించిన అనంతరం.. ప్రణబ్‌ముఖర్జీ, వాంగ్‌చుక్‌లు చర్చలు జరిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య విద్యారంగం సహా పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదరనున్నాయి. 26 ఏళ్ల తరువాత ఒక భారత రాష్ట్రపతి భూటాన్ పర్యటిస్తుండటం ఇదే ప్రథమం.