military air force
-
భారత దళాలు వైదొలగాలి
మాలె: మాల్దీవుల నుంచి భారత సైనిక దళాలు వైదొలగాలని ఆ దేశాధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ ముయ్జ్జు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే చైనా దళాలను కూడా తమ భూభాగంపైకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. భారత దళాలను వెనక్కు పంపుతానని ఎన్నికల సందర్భంగా ఆయన వాగ్దానం చేశారు. మాల్దీవుల్లో 70 మంది భారతసైనిక సిబ్బంది ఉన్నారు. భారత్ అందజేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఆ ప్రాంతంలో సైనికంగా ప్రభావం చూపేందుకు, ముఖ్యంగా మాల్దీవులపై పట్టు కోసం భారత్, చైనా దశాబ్దాలుగా పోటాపోటీగా ప్రయతి్నస్తూ వస్తున్నాయి. -
ప్రపంచంలోని టాప్ 10 మిలటరీ ఎయిర్ ఫోర్స్స్స్
-
సైనిక విమాన ప్రమాదంలో 11మంది మృతి
బొగొటా: కొలంబియా సైనిక విమాన ప్రమాదంలో 11 మంది వైమానిక దళ సిబ్బంది మృతిచెందారు. యాంత్రిక సమస్యలు తలెత్తడంతో ఎఫ్ఏసీ 1261 నంబర్ గల ఏకాసా 235 రవాణా విమానం సీజర్ ప్రాంతంలోని లాస్ పాల్మోస్ జోన్లో ప్రమాదానికి గురైనట్టు ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. మృతిచెందిన వారిలో ఒక మేజర్, అనుచరుడు సహా 9 మంది ఉన్నట్టు తెలిపింది. అయితే ఈ ఘటనపై తొలుత12 మంది మృతిచెందినట్టు ఆ దేశ అధ్యక్షుడు జుయాన్ మాన్యెల్ శాంటోస్ ట్విట్లర్ లో పేర్కొన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ఆయన ట్విట్లర్ ద్వారా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆ తరువాత రక్షణ దళం సైనిక విమానం ప్రమాదంలో 11 మంది వైమానిక దళ సభ్యులు మృతిచెందినట్టుగా తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.