కబడ్డీ ఎంపికలకు విశేష స్పందన | Kabaddi selections widespread | Sakshi
Sakshi News home page

కబడ్డీ ఎంపికలకు విశేష స్పందన

Published Sun, Sep 25 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

కబడ్డీ ఎంపికలకు విశేష స్పందన

కబడ్డీ ఎంపికలకు విశేష స్పందన

కడప స్పోర్ట్స్‌ : జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీనగర్‌ నగరపాలకోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన 64వ జిల్లాస్థాయి సీనియర్‌ పురుషుల, మహిళల కబడ్డీ ఎంపికలకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఈ ఎంపికలకు క్రీడాకారులు తరలివచ్చారు. ఈ క్రీడా ఎంపికలను జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు తోటృష్ణ, కార్యదర్శి చిదానందగౌడ్, గౌరవాధ్యక్షుడు హరిప్రసాద్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబడ్డీ ఎంపికలకు ఇంత చక్కటి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.  జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కోశాధికారి, కోచ్‌ టి. జనార్ధన్‌ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్‌ 6 నుంచి 9వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.  అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ప్రకటించారు. అంతకు మునుపు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులుగా ఎంపికైన సంపత్‌కుమార్, ఆనందమ్మ, నిత్యప్రభాకర్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సభ్యులు మహేష్‌రెడ్డి, గోవిందు నాగరాజు, వైవీయూ వ్యాయామబోర్డు కార్యదర్శి డా. కె. రామసుబ్బారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, పుల్లారావు, సుబ్బన్న, పి.సి. వెంకటరమణ, శేఖర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
పురుషుల జట్టు: ఎం. జనార్ధన్‌రెడ్డి, సుధీర్, వై. రవిశంకర్, ఎస్‌. ఓబులేసు, పి. మహేష్‌బాబు, బి. నాగేంద్ర, టి. గంగాధర్‌రెడ్డి, పి. రెడ్డయ్యరెడ్డి, కె.గిరీశ్‌కుమార్, కె. వీరకుమార్‌రెడ్డి, ఎం. శివగణేష్‌రెడ్డి, పి. కళ్యాణ్‌చరణ్‌తేజ. స్టాండ్‌బై : టి.సి. రాకేష్, పి.నాగేంద్ర, కె.ప్రశాంత్, ఎం.రాజకుమార్‌నాయక్, కె.మహేష్‌కుమార్‌.
మహిళల జట్టు : టి.శ్రీవాణి, బి.సుహాసిని, ఎం. రాణి, కె.నాగమునీశ్వరి, ఎస్‌.పూజ, యు.ఉమామహేశ్వరి, టి.పవిత్ర, సావిత్రి, పి. సౌజన్య, కె.రాణి, ఎం.ధనలక్ష్మి, వై.గౌరి. స్టాండ్‌బై : పి. భార్గవి, ఆర్‌.మనీష్, వి.శ్రీలత, ఎ.లక్ష్మిపూర్ణిమ, కె.శిల్ప.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement