మగవారికి మెనోపాజ్‌ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..! | Male Menopause: Symptoms Treatment And Overview | Sakshi
Sakshi News home page

Male Menopause: మగవారికి మెనోపాజ్‌ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!

Published Thu, Apr 11 2024 3:49 PM | Last Updated on Thu, Apr 11 2024 5:15 PM

Male Menopause: Symptoms Treatment And Overview - Sakshi

మహిళల్లో మెనోపాజ్‌కి సంబంధించిన లక్షణాలు ఉంటాయని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటే విన్నాం. అదే పరిస్థితి మగవారిలో కూడా ఉంటుందట. అయితే వాళ్లు దాన్ని పెద్దగా పట్టించుకోరు, గమనించరని అంటున్నారు. మహిళలకైతే స్థిరమైన అండాశయ నిల్వ కాలక్రమేణ తగ్గుతుంది. అదే పురుషుల్లో అయితే టెస్టోస్టెరాన్‌ అకస్మాత్తుగా పడిపోవడం వల్ల మెనోపాజ్‌ సమస్యలు వస్తాయట. సడెన్‌గా బరువు పెరగడం, జుట్టు బూడిద రంగులోకి మారిపోడం వంటి అనేక మార్పుల ద్వారా ఇది సంకేతం ఇస్తుందట. అయితే ఇంతవరకు దీనిపై పరిశోధనలు లేకపోవడం వల్ల దీని గురించి ఎవరికీ అంతగా అవగాహన లేదన్నారు. ఎందువల్ల ఈ పరిస్థితి మగవారికి వస్తుంది?. లక్షణాలు ఎలా ఉంటాయంటే..

మహిళల్లో మెనోపాజ్‌ దశ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, పైగా వివిధ అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మగవారిలో ప్రమాదం తీవ్రంగా ఉండదు గానీ కొన్ని సమస్యలు ఎదురవ్వుతాయని ఐవీఎఫ్‌ నిపుణురాలు డాక్టర్‌ శోభా గుప్తా అన్నారు. మగవారిలో వచ్చే మోనోపాజ్‌ని "ఆండ్రోపాజ్‌" అని పిలుస్తారని చెప్పారు. 

ఆండ్రోపాజ్‌ అంటే..
టెస్టోస్టెరాన్‌ స్థాయిల్లో క్షీణత కారణంగా ఆండ్రోపాజ్‌ వస్తుంది. ఇది సహజంగా వయసు తోపాటు దీని స్థాయిలు తగ్గడం వల్ల జరుగుతుంది. వయస్సుతో టెస్టోస్టెరాన్‌ తగ్గుదల అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. కొందరిలో చాలా ఆలస్యంగా సంభవిస్తుంది. స్త్రీల్లో మెనోపాజ్‌ వేగవంతంగా ఉంటే మగవారిలో ఈ దశ నెమ్మదిగా బయటపడుతుంది. 

లక్షణాలు..

  • ఫోకస్‌ తక్కువగా ఉండటం, అలిసిపోవటం
  • మానసిక స్పష్టత తగ్గింది (చెడు శ్రద్ధ, డౌన్‌బీట్ మూడ్).
  • శక్తి, బలం కోల్పోవడం.
  • కండరాలను కోల్పోవడం, కొవ్వును పేరుకుపోయి బరువు పెరగడం.
  • మూడ్‌లు మారిపోవడం లేదా చికాకు ఎక్కువగా ఉండటం.
  • కండరాలలో నొప్పులు 
  • చెమటలు లేదా వేడిగా అనిపించటం
  • చేతులు, కాళ్ళు చల్లగా అయిపోవడం
  • దురద
  • లైంగిక సామర్థ్యం తగ్గడం
  • ఎత్తు కోల్పోవడం

ఎందుకొస్తుందంటే..
టెస్టోస్టెరాన్ పురుషులలో అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది. ఉదాహరణకు ఇది లిబిడో, కండర ద్రవ్యరాశి, స్పెర్మ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి, రక్త ఉత్పత్తికి టెస్టోస్టెరాన్ చాలా అవసరం. ఇది అడ్రినల్ గ్రంథులు, వృషణాలలో ఉత్పత్తి అవుతుంది. పురుషుల వయస్సు ఆధారంగా స్పెర్మ్ ఉత్పత్తి చేసే సామర్థ్యం,టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం జరుగుతుంది. ఇది ఆండ్రోపాజ్ అనే పరిస్థితికి దారితీస్తుంది.

ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..
దాదాపు 40 ఏళ్ల వయసు నుంచి ప్రారంభమవుతుంది. అలా 70 ఏళ్ల వరకు కొనసాగుతుంది. అయితే వైద్యులు, సైకాలజిస్టులు పురుషులు మోనోపాజ్‌ దశన అనుభవిస్తారనే విషయాన్ని అంగీకరించరు. ఎందుకంటే..? చాలామంది దీన్ని ఫేస్ చేయకపోవడం అందుకు కారణం. మహిళలు ఎలా తమ భావాలను

ఎలా నిర్థారిస్తారంటే..
పైన చెప్పిన ఏ లక్షణాలు కనిపించనప్పుడూ రక్త పరీక్ష ద్వారా గుర్తించడం జరుగుతుంది. అప్పుడు టెస్టోస్టెరాన్‌ స్థాయిలు తక్కువగా ఉంటే హర్మోన్‌ పునః స్థాపన చికిత్స(హెచ్‌ఆర్టీ) ద్వారా పరిస్థితిని మెరుగుపరిచే యత్నం చేస్తారు వైద్యులు. అలాగే శారీరక శ్రమ, మంచి ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటివి చేయమని వైద్యులు సూచించడం జరుగుతుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మంచి పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు,పాల పదార్థాలను సమతుల్యంగా తీసుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం ఏరోబిక్ కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా ప్రోస్టేట్, టెస్టిక్యులర్, కార్డియోవాస్కులర్ క్యాన్సర్ కోసం తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.
హార్మోన్ స్థాయిలను చెక్‌ చేయించుకోండి. సాధారణంగా మనిషి శరీరంలోని అనేక ముఖ్యమైన హార్మోన్లు 40 నుంచి 55 ఏళ్ల మధ్య తగ్గడం ప్రారంభిస్తాయి.
ఒత్తిడిని తగ్గించుకోండి
భాగస్వామి సాన్నిహిత్యం, ఇరువురి మధ్య సరైన అండర్‌స్టాండింగ్‌ ఉండేలా చూసుకోవడం
దీంతోపాటు ముఖ్యంగా కంటినిండా నిద్రపోడం.
ఇలాంటవన్ని చేయగలిగితే మగవారి శృంగార జీవితానికి ఎలాంటి సమస్య ఉండదు. అంతేగాదు వారు ఈ దశను అధిగమించేలా సమతుల్య ఆహారం, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే సులభంగా బయటపడగలరని వైద్యులు చెబుతున్నారు. 

(చదవండి: బ్యూటీ క్వీన్‌గా కిరీటాన్ని గెలుచుకుంది..కానీ అంతలోనే..)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement