ధూంధాంగా షాబాని బర్త్ డే! | 'Handsome' gorilla's birthday celebrated in Japan | Sakshi
Sakshi News home page

ధూంధాంగా షాబాని బర్త్ డే!

Published Tue, Oct 20 2015 8:21 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

ధూంధాంగా షాబాని బర్త్ డే!

ధూంధాంగా షాబాని బర్త్ డే!

టోక్యో: షాబానిని ఎవరైనా చూడగానే ముచ్చటపడతారు. అంతటి అందం వాడిది. వాడిని ప్రత్యేకంగా చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలాంటిది షాబాని పుట్టినరోజున ఎవరు రాకుండా ఉంటారు! అందుకే వందలమంది మంగళవారం జపాన్లోని నాగోయా నగరంలోని జూకు బారులు తీరారు. షాబానికి ఇష్టమైన కూరగాయలతో కేకు తయారుచేయించి వాడితో కట్ చేయించారు. ఇంతకీ షాబాని ఎవరనుకుంటున్నారా? జపాన్లోనే అందమైన మగ గోరిల్లా.


నాగోయా జూలో మంగళవారం ఘనంగా ఈ గోరిల్లా 19వ పుట్టినరోజు జరిగింది. దాదాపు 500 మంది వీక్షకులు హాజరయ్యారు. తన గుహ ముందు కేకుతో బారులు తీరారు. జన్మదినం సందర్భంగా తాపీగా గుహ నుంచి బయటకు వచ్చిన షాబాని కేకులోని ఓ పెద్ద భాగాన్ని తిని సందర్శకులను ఆనందంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే టు యూ' అంటూ వారు పాట పాడారు.


షాబాని ఫొటోలకు ఆన్లైన్లో యమ క్రేజ్ ఉంది. దీని ఫొటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకున్నారు. మానవ కాలమానం ప్రకారం ఈ గోరిల్లా వయస్సు 30 ఏళ్లు ఉంటుంది. షాబానితో హుషారుగా గడిపిన సందర్శకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా భర్త కన్నా షాబానే బాగుందన్న ఓ మహిళ అనగా.. అందం విషయంలో షాబానితో పోటీపడలేనని మరో వ్యక్తి పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement