handsome
-
ఏమున్నాడు రా బాబు.. మహేశ్ అందానికి సీక్రెట్ ఏంటి?
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే సూపర్‌స్టార్ మహేశ్ బాబు అనే ఠక్కున చెప్పేస్తారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మహేశ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. వయసు పెరిగే కొద్దీ ఆయన అందం మరింత పెరుగుతుందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఏమున్నాడు రా బాబు, అచ్చం హాలీవుడ్ కటౌట్ అంటూ మహేశ్ లుక్స్‌కి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటారు. అమ్మాయిల మనసు కొల్లగొట్టడంలో మహేశ్ తర్వాతే ఎవరైనా. మరి మహేశ్ ఏం తింటాడు? 50కి దగ్గరవుతున్నా ఇంత హ్యాండ్స్‌మ్‌గా, ఛార్మింగ్ లుక్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు? ఆయన అందం వెనుకున్న సీక్రెట్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా అసూయపడుతుంటారు. ప్రతి సినిమాకి సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు మన సూపర్‌స్టార్. దీంతో ఆయన గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్ బాబు తన ఫ్యామిలీతో లండన్ ట్రిప్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను మహేశ్ భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, మహేశ్ యంగ్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆయన ఫిట్నెస్, డైట్ విషయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ టైంలో మహేశ్ సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తన డైట్ గురించి ప్రస్తావిస్తూ.. “చాలా వరకు అన్నీ తింటాను, కానీ లిమిట్స్ లో తింటాను.పెరుగు, డైరీ ప్రోడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్ లాంటివి అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి కొన్ని తింటాను వాళ్ళ కోసం. ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు తింటాను. ఇలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి సుమారు పదేళ్లవుతుంది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ఆ తర్వాత అలవాటైపోయింది అంటూ మహేశ్ స్వయంగా తెలిపాడు. మనం తినే తిండి ఎంత ముఖ్యమో, సంతోషంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని, బహుశా అదే తన ఎనర్జీకి కారణమై ఉంటుందని వివరించాడు. జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటాను. ఏ విషయాన్ని అయినా పెద్దగా ఆలోచించను. అదే నా ఎనర్జీ సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరో సీక్రెట్ ఏంటంటే.. ప్రతిరోజూ మహేశ్ మూన్ ధ్యానం చేస్తారట. అంటే ప్రతిరోజూ చంద్రుని నీడలో ధ్యానం చేస్తారట. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. సుధీర్ఘ కాలం నుంచి మహేశ్ ఈ మూన్ ధ్యానం చేయడం వల్ల ఇంత ఛార్మింగ్‌గా కనిపిస్తారని ఆయనతో పనిచేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ –లక్ష్మణ్‌లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఇక ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద వహించే మహేశ్ బాబు షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా జిమ్ చేస్తాడట. ఇక మహేశ్ బాబు అందం వెనుక ఓ డెర్మటాలజిస్ట్ కూడా ఉన్నారు. కర్ణాటకకు చెందిన రష్మి శెట్టి అనే డాక్టర్ గత కొన్నాళ్లుగా మహేశ్‌కు పర్సనల్ డెర్మలాటజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. -
ప్రపంచంలోని టాప్ - 10 అందమైన పురుషులు
-
అందంగా లేడని.. రుబ్బు రోలుతో..
-
అందంగా లేడని.. రుబ్బు రోలుతో..
కడలూరు: భర్త అందంగా లేడని తీవ్ర అసంతృప్తి చెందిన ఓ నవ వధువు పెళ్లయిన వారం రోజులకే అతడిని దారుణంగా చంపేసింది. తమిళనాడు రాష్ట్రం కడలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక యువకుడు(25)తో వారం రోజుల క్రితం యువతి(22)కు వివాహమయింది. పెళ్లయిన మరుసటి రోజు నుంచి ఆమె చాలా అసంతృప్తితో ఉంటోంది. భర్త ఆమెకు సరైన జోడు కాడని ఆమె స్నేహితులు, బంధువులు అంటుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భర్తతో గొడవ పడింది. తీవ్ర కోపంతో ఉన్న ఆమె భర్త తలపై రుబ్బు రోలుతో కొట్టి చంపేసింది. మంగళవారం ఉదయం తన భర్తను ఎవరో చంపేశారంటూ పెద్ద పెట్టున రోదించ సాగింది. బంధువుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు విచారించి.. నవ వధువే నిందితురాలని తేల్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
రాకీ హ్యండ్సమ్ రీమేక్ ప్లాన్‌లో 'రామ్ చరణ్'
-
ధూంధాంగా షాబాని బర్త్ డే!
టోక్యో: షాబానిని ఎవరైనా చూడగానే ముచ్చటపడతారు. అంతటి అందం వాడిది. వాడిని ప్రత్యేకంగా చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అలాంటిది షాబాని పుట్టినరోజున ఎవరు రాకుండా ఉంటారు! అందుకే వందలమంది మంగళవారం జపాన్‌లోని నాగోయా నగరంలోని జూకు బారులు తీరారు. షాబానికి ఇష్టమైన కూరగాయలతో కేకు తయారుచేయించి వాడితో కట్ చేయించారు. ఇంతకీ షాబాని ఎవరనుకుంటున్నారా? జపాన్‌లోనే అందమైన మగ గోరిల్లా. నాగోయా జూలో మంగళవారం ఘనంగా ఈ గోరిల్లా 19వ పుట్టినరోజు జరిగింది. దాదాపు 500 మంది వీక్షకులు హాజరయ్యారు. తన గుహ ముందు కేకుతో బారులు తీరారు. జన్మదినం సందర్భంగా తాపీగా గుహ నుంచి బయటకు వచ్చిన షాబాని కేకులోని ఓ పెద్ద భాగాన్ని తిని సందర్శకులను ఆనందంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే టు యూ' అంటూ వారు పాట పాడారు. షాబాని ఫొటోలకు ఆన్లైన్లో యమ క్రేజ్ ఉంది. దీని ఫొటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకున్నారు. మానవ కాలమానం ప్రకారం ఈ గోరిల్లా వయస్సు 30 ఏళ్లు ఉంటుంది. షాబానితో హుషారుగా గడిపిన సందర్శకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా భర్త కన్నా షాబానే బాగుందన్న ఓ మహిళ అనగా.. అందం విషయంలో షాబానితో పోటీపడలేనని మరో వ్యక్తి పేర్కొన్నాడు. -
రాజీవ్ అందగాడనే పెళ్లాడా
లాహోర్: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అందగాడనే తాను వివాహం చేసుకున్నట్లు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.. పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరితో అన్నారు. 2005లో నాటి పాక్ ప్రధాని ముషార్రఫ్‌తో కలసి భారత్‌కు వచ్చిన ఖుర్షీద్ సోనియాతో జరిపి సరదా సంభాషణను తన కొత్త పుస్తకం ‘నైదర్ ఏ హాక్ నార్ ఏ డవ్’లో పొందుపరిచారు. అందులో సోనియా మాటలను ఉటంకించారు.‘అప్పుడు నేను (సోనియా) కేంబ్రిడ్జ్ వర్సిటీలో చదువుతున్నాను. నా ఎదురుగా అందమైన యువకుడు వెళుతున్నాడు. నా పక్కనే ఉన్న సోహైల్‌ను(కాంగ్రెస్ నేత ఇఫ్తికరుద్దిన్ కుమారుడు) అతను ఎవరని అడిగాను. అతను(రాజీవ్) పండిట్ నెహ్రూ మనవడు అని సొహైల్ చెప్పాడు. నేను చిరునవ్వుతో ఆయన్ను(రాజీవ్) పలకరించా’ అని సోనియా చెప్పారన్నారు.