
అంజలి
యూఎస్‌లోని సియోటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డ్యూటీ చేశారు హీరోయిన్ అంజలి. పోలీసాఫీసర్‌గా ఆమె కేసులను ఎలా సాల్వ్ చేశారో వెండితెరపై చూడాల్సిందే. అనుష్క, ఆర్. మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే ముఖ్యతారలుగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఇటీవల ఈ సినిమాలోని అనుష్క, మాధవన్ లుక్స్‌ని విడుదల చేశారు. తాజాగా అంజలి లుక్‌ను రిలీజ్ చేశారు. యూఎస్ పోలీసాఫీసర్ ఏజెంట్ మహా పాత్రలో నటించారు అంజలి. ఈ పాత్ర కోసం దాదాపు 8 కిలోల బరువు తగ్గానని ఓ సందర్భంలో అంజలి పేర్కొన్నారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment