‘ప్రేమ’... ఈ రెండక్షరాల్లో ఏదో మ్యాజిక్ వుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన రెండు హృదయాల మనసు చప్పుడు ప్రేమ. ప్రేమ అంటే అబ్బాయి–అమ్మాయి మధ్య ఉండేదేనా? ఊహూ తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ.. ఇలా ఎన్నో ప్రేమలు. ఇప్పుడు మాత్రం మనం అబ్బాయి– అమ్మాయిల ప్రేమ గురించి చెప్పుకుందాం. సిల్వర్ స్క్రీన్‌ని ప్రేమతో ముంచెత్తిన ప్రేమలతో సినిమా క్విజ్.
1. ‘‘ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతి రూపమా...’ పాట వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ చిత్రం ‘ప్రేమ’లోనిది. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన హీరోయిన్‌గా నటించింది ఎవరు?
ఎ) రేవతి బి) శోభన సి) గౌతమి డి) సితార
2. ‘‘అరె ఏమైందీ... ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది’’ అనే హిట్ సాంగ్ ‘ఆరాధన’ చిత్రంలోనిది. ఇందులో నిరక్షరాస్యుడు పులిరాజు పాత్రలో నటించిన హీరో.. హీరోయిన్ సుహాసినిని ఆరాధిస్తాడు. పులిరాజు పాత్రలో నటించిన ప్రముఖ హీరో ఎవరు?
ఎ) వెంకటేశ్ బి) రాజశేఖర్ సి) సుమన్ డి) చిరంజీవి
3. ‘‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం..’’ పాట ‘అభినందన’ చిత్రంలోనిది. ఆ చిత్రానికి తన సంగీతంతో ప్రాణం పోసిన సంగీత దర్శకుడెవరు?
ఎ) మంగళంపల్లి బాలమురళీకృష్ణ బి) ఇళయరాజా సి) చక్రవర్తి డి) కె.వి. మహదేవన్
4. నాగార్జున కెరీర్‌లో బెస్ట్ ఇయర్స్‌లో 1989 ఒకటి. ఎందుకంటే ఆ ఇయరే ఆయనకు ‘శివ’ ‘గీతాంజలి’ లాంటి మంచి చిత్రాలు వచ్చాయి. ‘గీతాంజలి’లో హీరోయిన్ గిరిజ వాయిస్ చాలా వెరైటీగా ఉంటుంది. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఓ ప్రముఖ నటి. ఆమె ఎవరో?
ఎ) సరిత బి) రోహిణి సి) భానుప్రియ డి) సితార
5. ‘‘ప్రేమా ప్రేమా... ప్రేమ ప్రేమ, నను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు, వినిపించదా ప్రియా నా గోడు...’ అనే పాట ‘ప్రేమదేశం’ చిత్రంలోనిది. అబ్బాస్, వినీత్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌ని ఇద్దరూ పోటీపడి ప్రేమిస్తారు. ఆ హీరోయిన్ ఎవరో కనుక్కోండి?
ఎ) సిమ్రాన్ బి) సౌందర్య సి) టబు డి) సోనాలీ బింద్రే
6. ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలు వీళ్లు. వీరిలో ఓ హీరో పెళ్లి ఫిబ్రవరిలోనే జరిగింది. ఆ జంట ఎవరు?
ఎ) అల్లు అర్జున్ బి) మహేశ్‌బాబు సి) రామ్ చరణ్ డి) మంచు విష్ణు
7. ‘ నీరాజనం’ చిత్రంలోని ‘‘నిను చూడక నేనుండలేను ఈ జన్మలో.. మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే...’’ పాట ఓపీ నయ్యర్ స్వరపరిచారు. ఆ పాట రచయిత ఎవరు?
ఎ) వేటూరి బి) సిరివెన్నెల సి) ఆచార్య ఆత్రేయ డి) కృష్ణశాస్త్రి
8. తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ చిత్రానికి ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ రీమేక్. ఆ చిత్రంలో లవర్‌బాయ్‌గా నటించారు హీరో రవితేజ. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టినది ఓ ప్రముఖ ఛాయాగ్రాహకులు. ఆయనెవరు
ఎ) పీసీ శ్రీరాం బి) చోటా.కె. నాయుడు సి) ఎస్.గోపాల్‌రెడ్డి డి) అజయ్ విన్సెంట్
9. విషాద ప్రేమలకు కేరాఫ్ అడ్రస్ అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన చిత్రం ‘దేవదాసు’. ఆ చిత్రదర్శకుడు వేదాంతం రాఘవయ్య, నిర్మాత డి.ఎల్ నారాయణ. బెంగాలీలో శరత్‌చంద్ర చటర్జీ రాసిన కథ ఇది. ఆ కథను తెలుగు సినిమాగా తీయటానికి అవసరమైన రచనను చేసింది ఓ ప్రముఖ నిర్మాత. ఆయన పేరేంటి?
ఎ) ఆలూరు చక్రపాణి బి) నాగిరెడ్డి సి) వేదాంతం రాఘవయ్య డి) డి.యల్. నారాయణ
10. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ ‘‘బేబి మనం దూరంగా ఉండి 15డేస్ కూడా కాలేదు, అంటే నాకు 15 ఇయర్స్‌లా ఉంది’ అనే డైలాగ్ చెప్పిన హీరోయిన్ ఎవరు?
ఎ) కియరా అద్వానీ బి) మేఘా చౌదరి సి) ప్రియాంకా జవాల్కర్ డి) షాలినీ పాండే
11. ‘మరోచరిత్ర’ సినిమాతో కమల్‌హాసన్‌ని తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేశారు బాలచందర్. ఆ చిత్రంతోనే హీరోయిన్‌గా పరిచయమైన ప్రముఖ నటి ఎవరు?
ఎ) జయచిత్ర బి) జయసుధ సి) జయప్రద డి) సరిత
12. ‘‘ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని...’ పాట ‘ప్రేమికులరోజు’ సినిమాలోనిది. ఈ పాటను ప్రముఖ నిర్మాత ఏ.యం.రత్నం రాశారు. ఆ చిత్ర సంగీత దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) ఎ.ఆర్. రెహమాన్ బి) ఎస్.ఏ రాజ్‌కుమార్ సి) ఇళయరాజా డి) హారిస్ జయరాజ్
13. ‘‘ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే... ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే..’’ పాట శంకర్ దర్శకత్వం వహించిన ‘ప్రేమికుడు’ చిత్రంలోనిది. ఆ పాట పాడిందెవరో తెలుసా?
ఎ) ఉన్నిక్రిష్ణన్ బి) హరిహరన్ సి) ఎస్పీబీ డి) మనో
14. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సూపర్‌హిట్ లవ్ స్టోరీ ‘ఆర్య’. ఆ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎవరో గుర్తుందా?
ఎ) కీర్తీ చావ్లా బి) అనూ మెహతా సి) గజాలా డి) జెనీలియా
15. ‘‘గ్రీకువీరుడు... గ్రీకువీరుడు... గ్రీకువీరుడు, నా రాకుమారుడు కళ్లలోనే ఇంకా ఉన్నాడు...’’ పాటలో నాగార్జున, టబు నటించారు. ఆ చిత్రంలోని ఫ్యామిలీ లవ్‌స్టోరీని బేస్ చేసుకొని ఎన్నో మూవీస్ వచ్చాయి. ఆ చిత్రదర్శకుడెవరు?
ఎ) సురేశ్‌కృష్ణ బి) కృష్ణవంశీ సి) వైవీయస్ చౌదరి డి) గుణశేఖర్
16. మణిరత్నం దర్శకత్వం వహించిన క్లాసికల్ లవ్‌స్టోరీ ‘బొంబాయి’. ఆ చిత్రంలో అరవింద స్వామి, మనీషా కొయిరాల కాంబినేషన్‌లోని ‘ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు.. కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు...’’ అనే పాటలోని మేల్ వాయిస్ హరిహరన్ పాడారు. ఆ పాటలోని ఫిమేల్ వాయిస్‌ను పాడిన సింగర్ ఎవరో కనుక్కోండి?
ఎ) చిత్ర బి) శ్రేయాఘోషల్ సి) ఉషా డి) సునీత
17. ఉదయ్‌కిరణ్, అనిత నటించిన సూపర్‌హిట్ లవ్ స్టోరి ‘నువ్వు నేను’. ఆ చిత్రంలోని ‘‘నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం...’ పాటతో పాటు ఆ సినిమాలోని అన్ని పాటలను రచించిందెవరు?
ఎ) ఆర్.పి. పట్నాయక్ బి) కులశేఖర్ సి) వనమాలి డి) తేజ
18. నాగచైతన్య, సమంత జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి మొదటి సినిమా ‘ఏం మాయ చేసావే’ అని అందరికీ తెలుసు. ఇప్పుడు వారిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. వారిద్దరూ జంటగా నటిస్తున్న ఎన్నో సినిమా ఈ ‘మజిలీ’?
ఎ) 3 బి) 7 సి) 6 డి) 5
19. ‘‘హృదయం ఎక్కడున్నది...హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నాది...’’ పాట సూర్య నటించిన సూపర్‌హిట్ చిత్రంలోనిది. సూర్య సరసన నటించిన హీరోయిన్ ఎవరు?
ఎ) నయనతార బి) తమన్నా సి) అనుష్క డి) అసిన్
20. 1981లో విడుదలైన రొమాంటిక్ చిత్రం ‘సీతాకోకచిలుక’. ప్రముఖ దర్శకులు భారతీరాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నటి ఎవరో తెలుసా?
ఎ) శ్రీదేవి బి) ముచ్చర్ల అరుణ సి) శాంతిప్రియ డి) విజయశాంతి
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) (ఎ) 2) (డి) 3) (బి) 4) (బి) 5) (సి) 6) (బి) 7) (సి) 8) (సి) 9) (ఎ) 10) (డి) 11) (డి)
12) (ఎ) 13) (ఎ) 14) (బి) 15) (బి) 16) (ఎ) 17) (బి) 18) (డి) 19) (డి) 20) (బి)
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment