
ఎస్ ఫర్ సన్... స్కూల్లో ఇలానే చదువుకున్నాం. ఎస్ ఫర్ సన్ మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఫర్ సక్సెస్.. ఎస్ ఫర్ శర్వానంద్.. ఎస్ ఫర్ షాలినీ పాండే. ఈ ఎస్ అండ్ ఎస్‌కి జోడీ కుదిరిందని టాక్. సూపర్ సక్సెస్‌లతో దూసుకెళుతున్నారు శర్వా. ‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చేసుకున్నారు షాలినీ పాండే. ‘స్వామి రారా’ వంటి హిట్ మూవీతో దర్శకుడిగా మార్కులు కొట్టేసి, ‘దోచెయ్’, ‘కేశవ’లతో గ్రాఫ్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు.
ఇందులో శర్వా డ్యూయల్ రోల్ చేయనున్నారట. సో.. ఇద్దరు నాయికలు ఉండటం సహజం. ఒక నాయికగా షాలినీ పాండేని అడగడం, ఆమె దాదాపు ‘యస్’ అనడం జరిగాయట. మరి.. ఇంకో హీరోయిన్ ఎవరు? ఆమె పేరు కూడా ‘ఎస్’తోనే స్టార్ట్ అవుతుందా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment