జీవాతో రొమాన్స్‌కు సై | Shalini Pandey To Tie Up With Jiva For a Tamil Movie | Sakshi
Sakshi News home page

జీవాతో రొమాన్స్‌కు సై

Published Sat, Dec 2 2017 5:22 AM | Last Updated on Sat, Dec 2 2017 5:22 AM

Shalini Pandey To Tie Up With Jiva For a Tamil Movie - Sakshi

తమిళసినిమా: అపజయానికేమోగానీ, విజయానికి ఒక్క చిత్రం చాలు ఆ తరువాత కెరీర్‌ గాడిలో పడినట్లే. నటి శాలిని పాండేకు అలాంటి సక్సెస్‌ టాలీవుడ్‌ను దాటి కోలీవుడ్‌కు పరిచయం చేసేసింది. అర్జున్‌రెడ్డి అనే ఒక్క తెలుగు సినిమా ఆమె దశ మార్చేసింది. రంగస్థల నటి అయిన శాలిని నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఆ తరువాత అక్కడ మహానటి సావిత్రి జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న మహానది చిత్రంలో కీలక పాత్రను పోషి స్తోంది. అదే విధంగా తెలుగులో మంచి విజయాన్ని సాధించిన 100% లవ్‌ చిత్ర తమిళ రీమేక్‌లో తమన్నా పాత్రను చేసే లక్కీఛాన్స్‌ను అందుకుంది. ఇక నటుడు జీవాకు జంటగా నటించే కొత్త చిత్రంలో నటించే అవకాశం శాలినిపాండే తలుపు తట్టిందన్న తాజా సమాచారం. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో స్థిరపడాలని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీని గురించి శాలిని పాండే స్పందిస్తూ అర్జున్‌రెడ్డి చిత్రం తరువాత తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయని, అయితే అవన్నీ అంగీకరించకుండా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. తమిళంలో మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్న మాట నిజమేనని చెప్పింది. 100% కాదల్‌ చిత్రం పూర్తి అయిన తరువాత శాలిని జీవాతో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతుందనే కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇక్కడ ఒక్క చిత్రం విడుదల కాకుండానే మరో చిత్ర అవకాశాన్ని దక్కించుకుందంటే శాలినిపాండేను లక్కీ నటే అనాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement