అనుష్క సినిమాలో మరో ఇద్దరు భామలు | Anushka Shetty Next Film Update | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 14 2019 10:36 AM | Last Updated on Mon, Jan 14 2019 1:04 PM

Anushka Shetty Next Film Update - Sakshi

భాగమతి సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న అనుష్క త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్‌ కీలక పాత్రలో నటించనున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు.

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు అంజలి, షాలిని పాండేలు కూడా నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్‌, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్‌ జరపుకోనున్న ఈ చిత్రం మార్చి నెలలో అమెరికాలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement