![Shalini Pandey on shooting charan seva scene in Maharaj](/styles/webp/s3/article_images/2024/06/28/shalini.jpg.webp?itok=zLcOvTo3)
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఆ తర్వాత మహానటి, ఇద్దరి లోకం ఒకటే చిత్రాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న షాలిని.. ఇటీవల మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన మహారాజ్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పాండే పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమాలోని ఇంటిమేట్ సీన్ గురించి మాట్లాడింది. ఈ చిత్రంలో కిషోరి పాత్రను పోషించిన నటి షాలిని పాండే లైంగికపరమైన సీన్‌లో కనిపించారు. ఆ సన్నివేశంలో తన అనుభవం గురించి వెల్లడించింది.
ఆ సీన్ చేసేటప్పుడు ఆకస్మాత్తుగా బయటకు వెళ్లానని తెలిపింది. అయితే అది నాపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియదు కానీ.. నాకు చీకటి గదిలో ఉండాలంటే భయమని షాలిని వెల్లడించింది. తనకు కొంత సమయం, ప్రశాంతమైన వాతావరణం కావాలని డైరెక్టర్‌ను అడిగానని వివరించింది. దీంతో వారు వెంటనే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారని షాలిని పేర్కొంది. కాగా.. సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన మహారాజ్‌లో జైదీప్ అహ్లావత్ స్త్రీలపై అత్యాచారం చేసే పాత్రలో కనిపిస్తాడు. 1800 కాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment