కొత్త లుక్‌లో కల్యాణ్ రామ్‌ | Kalyan Ram Action Thriller Slated For Year End Release | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 24 2018 11:32 AM | Last Updated on Wed, Oct 24 2018 11:32 AM

Kalyan Ram Action Thriller Slated For Year End Release - Sakshi

నందమూరి హీరో కల్యాణ్ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవీ గుహన్‌ దర్శకుడు. ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అందుకోసం బాలీవుడ్‌ స్టైలిష్ట్‌ హకీం అలీం  నేతృత్వంలో ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యాడు కల్యాణ్ రామ్‌.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌ నెలాఖరునగాని, జనవరి లోగాని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కల్యాణ్ రామ్‌ సరసన నివేదా థామస్‌, షాలిని పాండేలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement