
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించారు. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. టీజర్‌లో కల్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్‌తో కనిపించారు. ఏదో తెలియని విషయం ఆయన్ని వెంటాడుతున్నట్లు, ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు ఆయన పాత్రను కె.వి.గుహన్ మలిచినట్లుగా టీజర్ చెబుతోంది.
మహేశ్ కోనేరు మాట్లాడుతూ –‘‘స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ‘118’ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కల్యాణ్ రామ్‌గారు ఇప్పటివరకు చేయనటువంటి జోనర్‌లో రూపొందింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం: కె.వి.గుహన్.
Comments
Please login to add a commentAdd a comment