
షాలినీ రాగమా! ఇదెక్కడి రాగం? అసలు ఇలాంటి రాగం ఒకటి ఉందా అని అవాక్కవుతున్నారా? ఇది రాగం పేరు కాదండీ షాలినీ పాండే తీస్తున్న రాగం. ‘బేబీ.. బేబీ... ’ అంటూ ‘అర్జున్ రెడ్డి’లో బుజ్జి బుజ్జిగా తెలుగు పలుకులు పలికారు ప్రీతీ శెట్టి. అదేనండి షాలినీ పాండే. ఫస్ట్ సినిమాకే తెలుగు డబ్బింగ్ చెప్పుకుని తెలుగు ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచారీ జబల్‌పూర్ భామ. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరచటానికి రెడీ అయ్యారు షాలినీ. ఈసారి ఏకంగా పాట పాడేశారామె.
‘నా ప్రాణమై...’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్‌ను ఇటీవల రికార్డ్ చేశారు షాలినీ. ‘లగోరీ’ అనే ఇండియన్ బ్యాండ్ కంపోజ్ చేసిన ఈ పాటకు షాలినీ తన వాయిస్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ 14న ఈ పాటను రిలీజ్ చేయనున్నారట. తొలి సినిమాతోనే తెలుగు డబ్బింగ్ చెప్పుకొని, రెండో సినిమా కూడా రిలీజ్ కాకముందే ఓ పాటను పాడటం విశేషమే కదండి.
ఇదిలా ఉంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతున్నారు షాలినీ. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో, జీ.వీ.ప్రకాశ్‌తో ‘100% లవ్’ తమిళ రీమేక్ ‘100% కాదల్ లో, జీవా సరసన ‘గొరిల్లా’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment