మహేష్ ‌25.. ఆమె హీరోయిన్‌ కాదు! | Shalini Pandey Crucial Role in Mahesh Movie | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 9 2018 3:54 PM | Last Updated on Mon, Apr 9 2018 3:54 PM

Shalini Pandey Crucial Role in Mahesh Movie  - Sakshi

భరత్‌ అనే నేను చిత్రం తర్వాత సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. మహేష్‌​ కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది. దాదాపుగా విదేశాల్లోనే ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను అల్రెడీ తీసేసుకోగా.. ఇప్పుడు మరో హీరోయిన్‌కు ఛాన్స్‌ దక్కినట్లు వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. 

అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ షాలిని పాండేను ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం మేకర్లు సంప్రదించగా.. ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెది హీరోయిన్‌ పాత్ర కాదని.. ఓ కీలక పాత్ర మాత్రమేనని చిత్ర యూనిట్‌ నుంచి అందుతున్న సమాచారం. దిల్‌ రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించబోతున్నాడు. అల్లరి నరేష్‌ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. భరత్‌ అనే నేను చిత్రం విడుదల తర్వాత మహేష్‌.. కాస్త గ్యాప్‌ తీసుకుని 25వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement