బిజీ అవుతోన్న అర్జున్ రెడ్డి హీరోయిన్ | Shalini Pandey approached for Dulquer Salmaan Next | Sakshi
Sakshi News home page

బిజీ అవుతోన్న అర్జున్ రెడ్డి హీరోయిన్

Published Thu, Oct 12 2017 3:16 PM | Last Updated on Thu, Oct 12 2017 3:16 PM

Shalini Pandey

అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ షాలిని పాండే. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. ఇప్పటికే సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటితో పాటు 100% లవ్ తమిళ రీమేక్ లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించనుంది షాలినీ.

ఓకె బంగారం సినిమాతో టాలీవుడ్ లోనూ ఘనవిజయం సాధించిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ ద్విభాషా చిత్రంలో షాలినీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆర్ ఏ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశముంది. మహానటి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న దుల్కర్ ఆ సినిమా షూటింగ్ సమయంలో షాలిని నటన చూసి మరో సినిమాకు ఆమెను ఎంపిక చేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement