హిందీలో లాగానే తెలుగు చిత్రసీమలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల నిర్మాత అల్లు అరవింద్, రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు త్రివ్రికమ్, హీరోయిన్ నివేదా థామస్‌లు కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకులు గుణశేఖర్, వి.ఎన్ .ఆదిత్య పేర్లు చేరాయి. ‘దిల్’ రాజుకు కరోనా లక్షణాలు లేవు. కానీ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ‘శాకుంతలం’ దర్శకుడు గుణశేఖర్‌కు సైతం కరోనా పాజిటివ్ అని సోమవారం పొద్దు పోయాక తెలిసింది.
గతవారం ఓ స్టూడియోలో పవన్‌కల్యాణ్ – హరీశ్ శంకర్ కొత్త చిత్రం ఫోటోషూట్ జరుగుతుంటే, అక్కడకు వెళ్ళి పవన్‌కల్యాణ్‌ను రాజు కలిశారు. ఆ పక్కనే స్వీయ సమర్పణలో షూటింగ్ జరుగుతున్న ‘శాకుంతలం’ సెట్స్‌కు కూడా వెళ్ళి వచ్చారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే పవన్ కల్యాణ్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్ళారు. ఆలస్యంగా పాజిటివ్ అయిన గుణశేఖర్ కూడా క్వారంటైన్ బాట పట్టారు. దాంతో, ‘శాకుంతలం’ షూటింగ్ కొన్నాళ్ళు ఆగనుంది. మరోపక్క ఈ నెల 23న రిలీజు కావాల్సిన నాని ‘టక్ జగదీశ్’ సైతం తెలుగు నేలపై కరోనా కలకలంతో వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment