కాంబినేషన్‌ కుదిరేనా? | prabhas and samantha to team up | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ కుదిరేనా?

Published Tue, Apr 2 2019 3:03 AM | Last Updated on Tue, Apr 2 2019 3:03 AM

prabhas and samantha to team up - Sakshi

ప్రభాస్‌,సమంత

టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ స్టార్స్‌ అందరితో యాక్ట్‌ చేశారు సమంత. పవన్‌ కల్యాణ్‌ (అత్తారింటికి దారేది), మహేశ్‌బాబు (దూకుడు) ఎన్టీఆర్‌ (బృందావనం), రామ్‌చరణ్‌ (రంగస్థలం) ఇలా జత కట్టిన ప్రతి హీరోతో హిట్‌ సాధించారు సమంత. ప్రభాస్‌తో మాత్రం సమంత ఇప్పటివరకూ ఒక్కసినిమాలో కూడా నటించలేదు. అయితే త్వరలోనే సమంత, ప్రభాస్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తోన్న ‘సాహో, జాన్‌’ చిత్రాల తర్వాత ‘దిల్‌’ రాజు నిర్మాణంలో ప్రభాస్‌ ఓ సినిమాలో యాక్ట్‌ చేస్తారట.

‘దిల్‌’ రాజు ప్రొడక్షన్‌లో ‘96’ రీమేక్‌లో హీరోయిన్‌గా చేస్తున్నారు సమంత. ‘96’తో పాటు సమంతతో మరో రెండు సినిమాల డీల్‌ కుదుర్చుకున్నారట నిర్మాత ‘దిల్‌’రాజు. అందులో భాగంగా రూపొందే సినిమాలోనే సమంత– ప్రభాస్‌ జోడీ కడతారట. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలియాల్సి›ఉంది. మరి ఈ కొత్త కాంబినేషన్‌ కుదిరేనా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ప్రభాస్‌ ‘జాన్‌’ విషయానికి వస్తే ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ సోమవారం ముగిసింది. ‘‘జాన్‌ సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేశాం. 1970లో యూరప్‌లో జరిగే ఇద్దరి ప్రేమికుల కథే మా చిత్రం’’ అని పేర్కొన్నారు చిత్రదర్శకుడు రాధా కృష్ణకుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement