దానయ్య, బన్నివాసు, నాగబాబు, శ్రీధర్, ‘దిల్’ రాజు, నారాయణ
ఇలా అండర్‌స్టాండింగ్‌కి రావడానికి ఏర్పాటైన సమావేశంలో ఆ రెండు చిత్రాల నిర్మాతలతో పాటు నిర్మాత ‘దిల్’ రాజు, కె.ఎల్ నారాయణ పాల్గొన్నారు. ‘‘రెండు భారీ చిత్రాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలని మాట్లాడుకున్నాం. అందుకే ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఏప్రిల్ 20న, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మే 4న రిలీజ్ చేయాలని నిర్ణయించాం.
ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్న అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేసిన మా హీరోలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు డివీవీ దానయ్య, లగడపాటి శ్రీధర్, ‘బన్నీ’ వాసు. ‘‘సంక్రాంతి సీజన్‌ను మినహాయించి మిగిలిన సందర్భాల్లో రెండు భారీ చిత్రాల మధ్య ఇలా రెండు వారాల గ్యాప్ ఇచ్చి రిలీజ్ డేట్స్ ప్లాన్ చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరగుతుంది.
‘భరత్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల నిర్మాతల మధ్య మంచి అండర్‌స్టాండింగ్ కుదరడం శుభపరిణామంగా భావిస్తున్నాం’’ అన్నారు నాగబాబు. ఏప్రిల్ 20న ‘భరత్ అనే నేను’, ఆరు రోజుల గ్యాప్ తర్వాత 27న ‘కాలా’, ఆ నెక్ట్స్ వీక్ మే 4న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వస్తాయి. ఎలాగూ ఏప్రిల్ 5న నితిన్ ‘ఛల్ మెహన్‌రంగ’, ఏప్రిల్ సెకండ్ వీక్‌లో నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వచ్చేస్తాయి. అటు ఆ రెండు సినిమాలకూ.. ఆ తర్వాత విడుదల కానున్న సినిమాలకూ మధ్య గ్యాప్ రావడంతో ఏప్రిల్ వార్ వేడి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment