KL Narayana
-
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో సినిమా అంటే హాలీవుడ్ హీరోలు కూడా రెడీ అంటారు. కానీ జక్కన్న మాత్రం తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమా చేసి హిట్ కొడుతున్నాడు. అంతేకాదు తన సినిమాలను నిర్మించే అవకాశం టాలీవుడ్ ప్రొడ్యుసర్లకే ఇస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో తనతో సినిమా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలకే అవకాశం ఇస్తున్నాడు. తాజాగా మహేశ్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో కూడా రాజమౌళి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యలతను ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణకు అప్పగించాడు. 15 ఏళ్ల క్రితం తనకు ఇచ్చిన మాటను రాజమౌళి- మహేశ్ బాబు నిలబెట్టుకున్నారని నారాయణ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో సినిమా చేయాలని 15 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే నా బ్యానర్(దుర్గా ఆర్ట్స్)లో సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు మహేశ్, రాజమౌళి ఇద్దరి స్థాయి పెరిగిపోయింది. వీళ్లతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా.. ‘దుర్గా ఆర్ట్స్ బ్యానర్’లో సినిమా చేస్తున్నామని వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయి. వాటిని రిజెక్ట్ చేసి మరీ నాతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో షూటింగ్ప్రారంభం అవుతుంది. బడ్జెట్ఎంత అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’ అన్నారు. -
మహేశ్- రాజమౌళి సినిమా బడ్జెట్ రూ. 1000 కోట్లు..!
తెలుగు సినీ అభిమానులందరూ మహేశ్ బాబు- రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేది దర్శకదీరుడు రాజమౌళి కావడంతో ఎంతటి అంచనాలు పెట్టుకున్నా అంతే స్థాయిలో సినిమాను తెరకెక్కాస్తాడు. పాన్ ఇండియా రేంజ్లో మహేశ్ బాబు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభించనున్నాడు జక్కన్న. వాస్తవంగా ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ ఉన్నారనే సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల క్రితం ఆయనకు జక్కన్న- మహేశ్ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ మార్కెట్ భారీగా పెరిగినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారు. కానీ అడ్వేంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్ అవుతుంది. సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖంగా దిల్ రాజు పేరు బలంగా వినిపిస్తుంది. ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరోవైపు ఓటీటీ దిగ్గజం అయిన నెట్‌ఫ్లిక్స్ తొలిసారి ఒక తెలుగు సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇంత వరకు డిజిటల్ వరకే ఉన్న నెట్‌ఫ్లిక్స్ మహేశ్ సినిమాతో థియేట్రికల్ బిజినెస్‌లోకి అడుగు పెట్టేందుకు ప్రతిపాదన పెట్టిందట. MMSB 29 కోసం ఎన్ని వందల కోట్లు అయినా పెట్టేందుకు తాము రెడీగా ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపిందట. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు రాజమౌళి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
సూపర్ కాంబినేషన్ ఫిక్స్
‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎవరు హీరోగా నటించబోతున్నారనే సస్పెన్స్‌కు శనివారం తెరపడింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా నటించబోతున్నట్లు వెల్లడించారు రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ కుదిరింది. దీంతో సూపర్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందని సంబరపడిపోతున్నారు మహేశ్ ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు రాజమౌళి. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడటంతో ప్రస్తుతం వీడియో కాల్ ద్వారా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు రాజమౌళి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. మరోవైపు మహేశ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుందనే ప్రచారం జరగుతోంది. మహేశ్, రాజమౌళి ప్రస్తుత కమిట్మెంట్స్ను పూర్తి చేసుకున్న తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా సెట్స్‌పైకి వెళ్తుందనుకోవచ్చు. -
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేశ్‌తోనే.. జక్కన్న క్లారిటీ
రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) తర్వాత తన తదుపరి చిత్రం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఉంటుందని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్పష్టం చేశారు. నిర్మాత కేఎల్ నారాయణ, మహేశ్, తన కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని ఎప్పట్నుంచో చెబుతున్నానని, డీవీవీ దానయ్య చిత్రం తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న ప్రభాస్‌తో మరో చిత్రం లేక ఈగ సీక్వెల్ చేస్తాడని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రం గురించి స్పష్టతనివ్వడంతో రూమర్స్‌కు చెక్ పడింది. ఇక రాజమౌళి-మహేశ్ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని అనధికారికంగా తెలిసినా.. ఇప్పటివరకు వీరిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ మహేశ్ సినిమాపై దర్శకధీరుడు స్పష్టతనిచ్చాడు. ఈ సినిమాపై జక్కన్న తొలిసారి స్పందించడంతో మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాకుండా మహేశ్ కోసం జక్కన్న ఏ కథను సిద్దం చేస్తున్నాడనే ఆసక్తిని కూడా కనబరుస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ను రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ బర్త్‌డే సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో విడుదలైన ప్రత్యేక వీడియోతో సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఇక మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మరొ సర్ప్రైజ్ ఉంటుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నాడు. మరోవైపు పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు సూపర్‌స్టార్. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి విడుదల చేయాలని భావిస్తున్నారు. చదవండి: సుధీర్ డ్యాన్స్ స్టెప్పులకు టైగర్ ఫిదా 10 కోట్ల వ్యూస్.. సంబరంలో మహేశ్ ఫ్యాన్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు
ముదినేపల్లి రూరల్ (కైకలూరు) : ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు. ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు జరుపుతామని అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్, విజయవాడల్లోని నారాయణ కార్యాలయాలు, నివాసాల్లోనూ సోదాలు జరిగినట్లు సమాచారం. కాగా, దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ పలు హిట్ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ, దొంగాట, క్షణక్షణం వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. -
సంక్రాంతికి మినహాయింపు
ఇలా అండర్‌స్టాండింగ్‌కి రావడానికి ఏర్పాటైన సమావేశంలో ఆ రెండు చిత్రాల నిర్మాతలతో పాటు నిర్మాత ‘దిల్’ రాజు, కె.ఎల్ నారాయణ పాల్గొన్నారు. ‘‘రెండు భారీ చిత్రాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలని మాట్లాడుకున్నాం. అందుకే ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఏప్రిల్ 20న, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మే 4న రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్న అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేసిన మా హీరోలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు డివీవీ దానయ్య, లగడపాటి శ్రీధర్, ‘బన్నీ’ వాసు. ‘‘సంక్రాంతి సీజన్‌ను మినహాయించి మిగిలిన సందర్భాల్లో రెండు భారీ చిత్రాల మధ్య ఇలా రెండు వారాల గ్యాప్ ఇచ్చి రిలీజ్ డేట్స్ ప్లాన్ చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరగుతుంది. ‘భరత్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల నిర్మాతల మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదరడం శుభపరిణామంగా భావిస్తున్నాం’’ అన్నారు నాగబాబు. ఏప్రిల్ 20న ‘భరత్ అనే నేను’, ఆరు రోజుల గ్యాప్ తర్వాత 27న ‘కాలా’, ఆ నెక్ట్స్ వీక్ మే 4న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వస్తాయి. ఎలాగూ ఏప్రిల్ 5న నితిన్ ‘ఛల్ మెహన్రంగ’, ఏప్రిల్ సెకండ్ వీక్‌లో నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వచ్చేస్తాయి. అటు ఆ రెండు సినిమాలకూ.. ఆ తర్వాత విడుదల కానున్న సినిమాలకూ మధ్య గ్యాప్ రావడంతో ఏప్రిల్ వార్ వేడి తగ్గింది. -
ఆశావహుల్లో సినీ ప్రముఖులు
♦ టీడీపీ సీటు ద్వారా రాజ్యసభలో ప్రవేశానికి జోరుగా యత్నాలు ♦ పరిశీలనలో దగ్గుబాటి సురేష్, కేఎల్ నారాయణ పేర్లు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సీటును ఆశిస్తున్నవారి జాబితాలో ప్రముఖ సినీ నిర్మాతలు దగ్గుబాటి సురేష్, డాక్టర్ కేఎల్ నారాయణ కూడా చేరారు. తమ ఆసక్తిని వీరు ఇటీవల టీడీపీ పెద్దలకు తెలియజేశారని, పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజ్యసభకు ఎన్నికలు ఈ ఏడాది జూన్‌లో జరగనున్నాయి. టీడీపీకి మూడు సీట్లు దక్కనుండగా.. అందులో ఒకటి తమకు కేటాయించాలని మిత్రపక్షమైన బీజేపీ కోరుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సురేష్ టీడీపీ మాజీ ఎంపీ, సినీ నిర్మాత, దర్శకుడైన దివంగత దగ్గుబాటి రామానాయుడు కుమారుడు. దగ్గుబాటి కుటుంబం తొలినుంచీ టీడీపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతోంది. సురేష్‌ను రాజ్యసభకు పంపితే సినీ రంగం నుంచి పార్టీకి పూర్తి మద్దతు ఉంటుందనే అభిప్రాయాన్ని టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సినీ రంగంతో సన్నిహిత సంబంధాలున్న ఓ ఎమ్మెల్యేతో పాటు ఓ మంత్రి కూడా సురేష్ పేరును చంద్రబాబు వద్ద ఇప్పటికే ప్రస్తావించారనే ప్రచారం జరుగుతోంది. ఇక నారాయణ కూడా టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. తనను రాజ్యసభకు పంపితే పార్టీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని నారాయణ చెప్పినట్లు తెలిసింది. మిగతావారి విషయానికొస్తే.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు అన్నివిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కంభంపాటికి ఎన్డీఏలో కీలకపాత్ర పోషించే బీజేపీతో పాటు మిగిలిన పార్టీల్లోని పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయన ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతల నుంచి కూడా చంద్రబాబుకు ఫోన్లు చేయిస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరి ఆ వెంటనే ఎమ్మెల్సీ సీటును తన తప్పిదం వల్ల చేజార్చుకుని ఓ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమితుడైన నేత పేరును ఓ కాంగ్రెస్ ఎంపీ సిఫారసు చేశారని ప్రచారం జరుగుతోంది. ‘ఎమ్మెల్యేలను కొనండి .. టిక్కెట్టు తీసుకోండి’ ‘ఎమ్మెల్యేను కొనండి -టిక్కెట్టు తీసుకోండి’ అనే ఆఫర్‌ను ఓ కేంద్ర మంత్రికి టీడీపీ అధిష్టానం ఇచ్చిందని సమాచారం. ఈ మంత్రి రాజ్యసభ అభ్యర్థిత్వం ఈ ఏడాది జూన్‌లో ముగియనుంది. విదేశీ బ్యాంకులను ముంచిన కేసులో ఇరుక్కున్న ఈ మంత్రికి చంద్రబాబు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల 8 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారికి భారీ ఎత్తున నగదు ముట్ట చెప్పారనే ప్రచారం జరుగుతోంది. ఈ డబ్బును ఈ మంత్రే సమకూర్చారని టీడీపీ వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోళ్లను అదేవిధంగా కొనసాగిస్తే టిక్కెట్టు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రికి బాబు హామీ ఇచ్చినట్లు చెబుతున్నాయి. ప్రధాని అడిగితే ఇద్దాం.. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి అడిగితే బీజేపీకి సీటు ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని సమాచారం. రాష్ట్రం విడిపోయిన తరువాత ఇప్పటివరకు కేంద్రం నుంచి ఆశించినంత సాయం రాలేదు. మిత్రపక్షమైన టీడీపీ నేతలకు గవర్నర్‌తో పాటు పలు పదవులు ఇస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారు. అయితే బీజేపీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అలాంటప్పుడు వారు అడగకముందే రాజ్యసభ సీటు ఇవ్వడంకంటే అడిగించుకుని, నిధులు, పదవుల హామీలు ఏమయ్యానని ప్రధాని వద్ద ప్రస్తావించి సీటు కేటాయించాలనే యోచనలో బాబు ఉన్నట్టు టీడీపీవర్గాల సమాచారం. అదే సమయంలో బీజేపీ ఎవరి మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తోందని, టీడీపీకే వారితో అవసరం కాబట్టి ప్రధాని అడిగినా, అడగకపోయినా ఒక సీటు కేటాయించటం ఖాయమనే వాదన వినిపిస్తోంది.