
ముదినేపల్లి రూరల్ (కైకలూరు) : ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు. ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు జరుపుతామని అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్, విజయవాడల్లోని నారాయణ కార్యాలయాలు, నివాసాల్లోనూ సోదాలు జరిగినట్లు సమాచారం.
కాగా, దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ పలు హిట్ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ, దొంగాట, క్షణక్షణం వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment