ఇచ్చిన మాట కోసం హాలీవుడ్‌ ఆఫర్‌ వదులుకున్న రాజమౌళి! | SSMB29: KL Narayana Interesting Comments On Rajamouli And Mahesh Babu | Sakshi
Sakshi News home page

SSMB29: 15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం హాలీవుడ్‌ ఆఫర్‌ వదులుకున్న రాజమౌళి!

Published Thu, May 2 2024 5:25 PM | Last Updated on Thu, May 2 2024 6:47 PM

SSMB29: KL Narayana Interesting Comments On Rajamouli And Mahesh Babu

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో సినిమా అంటే హాలీవుడ్‌ హీరోలు కూడా రెడీ అంటారు. కానీ జక్కన్న మాత్రం తెలుగు హీరోలతో పాన్‌ ఇండియా సినిమా చేసి హిట్‌ కొడుతున్నాడు. అంతేకాదు తన సినిమాలను నిర్మించే అవకాశం టాలీవుడ్‌ ప్రొడ్యుసర్లకే ఇస్తున్నాడు. 

కెరీర్‌ తొలినాళ్లలో తనతో సినిమా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలకే అవకాశం ఇస్తున్నాడు. తాజాగా మహేశ్‌ బాబుతో చేయబోయే సినిమా విషయంలో కూడా రాజమౌళి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నాడు. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యలతను ప్రముఖ నిర్మాత కేఎల్‌ నారాయణకు అప్పగించాడు. 15 ఏళ్ల క్రితం తనకు ఇచ్చిన మాటను రాజమౌళి- మహేశ్‌ బాబు నిలబెట్టుకున్నారని నారాయణ అన్నారు. 

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో సినిమా చేయాలని 15 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే నా బ్యానర్‌(దుర్గా ఆర్ట్స్‌)లో సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు మహేశ్‌, రాజమౌళి ఇద్దరి స్థాయి పెరిగిపోయింది. వీళ్లతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు. 

నేను చెప్పకపోయినా.. ‘దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌’లో సినిమా చేస్తున్నామని వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్‌ ఆఫర్లు కూడా వచ్చాయి. వాటిని రిజెక్ట్‌ చేసి మరీ నాతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతోంది.   ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లో షూటింగ్‌ప్రారంభం అవుతుంది. బడ్జెట్‌ఎంత అనేది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. కానీ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’  అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement