
రాకేష్ వర్రె, గార్గేయి
ఇండస్ట్రీలో అభిరుచి గల నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు ‘దిల్’ రాజు. తాజాగా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే చిత్రాన్ని అక్టోబరు 8న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారాయన. రాకేష్ వర్రె, గార్గేయి హీరో హీరోయిన్లుగా నటించారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బసవ శంకర్ దర్శకత్వంలో రాకేష్ వర్రె నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ చిత్రాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తుంటారు. ఈ చిత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కూడా. మా సినిమాను విడుదల చేస్తున్న ‘దిల్’ రాజుగారికి స్పెషల్ థ్యాంక్స్. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రాకేష్. ఈ సినిమాకు శంకర్ శర్మ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment