దిల్ రాజు
‘‘చిన్న సినిమా తీయాలంటే భయం వేస్తోంది. ఎందుకంటే ఆడకపోతే మొత్తం పోతుంది. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకురావాలంటే వాళ్లకు ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. పెట్టిన డబ్బుతో చిన్న సినిమాను సక్సెస్ చేసి, తిరిగి డబ్బు తెచ్చుకోవడం కష్టమైపోయింది. గతేడాది మిడిల్ రేంజ్ హీరోలతో నాలుగు సినిమాలు తీశాను. రైట్ కంటెంట్‌తో రైట్ సినిమా తీస్తే సినిమా హిట్ అవుతుందని గతేడాది ప్రూవ్ అయ్యింది’’ అన్నారు ‘దిల్’ రాజు. రాజ్‌తరుణ్, రిద్ధి కుమార్ జంటగా అనీష్‌కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ నిర్మించిన సినిమా ‘లవర్’. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు చెప్పిన సంగతలు...
► అనీష్ దర్శకత్వం వహించిన ‘అలా ఎలా?’ చూశాను. బాగుందనిపించింది. ఆ తర్వాత 2016లో అనీష్ ఓ స్టోరీలైన్ చెప్పాడు. గతేడాది ఆరు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కుదరలేదు. సేమ్‌టైమ్ నాలుగేళ్లుగా ప్రాజెక్ట్స్ చూసుకుంటున్న హర్షిత్ కూడా తనకు ఓ సినిమాను అప్పజెప్పమని అడిగాడు. ఎందుకో ఈ సినిమా ఇవ్వాలనిపించింది. మ్యూజిక్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి, ఒక్కో పాటను ఒక్కో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో చేయిస్తానని హర్షిత్ అన్నప్పుడు షాకయ్యాను. కానీ ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తుంది. సినిమా చూసిన వారందరూ క్లైమాక్స్ బాగుందని చెబుతున్నారు. ఆ రోజు హర్షిత్ అడిగిన వాటికి వంద శాతం పాసయ్యాడు. కానీ ఈ సినిమా బడ్జెట్ ముందుగా అనుకున్నట్లు 5 కోట్లు కాక, దాదాపు 8 కోట్లకు చేరుకుంది. లక్కీగా ఈ రోజుల్లో శాటిలైట్, హిందీ డబ్బింగ్ అంటూ ఇలా మార్కెట్ కూడా పెరిగింది. ఇది మంచి విషయం.
► ఫ్యామిలీ ఎమోషన్స్‌కు దూరమైన ఓ అనాథ కుర్రాడు, తన వారసులకు ఆ సమస్య రాకూడదని ఆలోచిస్తాడు. అలాగే తాను ప్రేమించిన అమ్మాయి తనకు అద్భుతమైన లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాడు. అతని ప్రయాణంలో జరిగిన సంఘటనలే ‘లవర్’ చిత్రం.
► రెగ్యులర్ సినిమాలే ఇండస్ట్రీలో వస్తాయన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి. కొత్త సినిమాలు తీయాలని నాకూ ఉంటుంది. కానీ ఫ్యామిలీ అండ్ యూత్ జానర్‌పై నాకు గ్రిప్ ఉంది. అందుకే షిఫ్ట్ అవ్వను. అలా కాకుండా కాస్త బయటికి వెళ్లినప్పుడు ఎకానమీ పరంగా ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడ పెడుతున్నాం? ఎంత వస్తుంది అని ఆలోచించాల్సిందే.
► మా బ్రదర్ వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నో డౌట్.. తన ఫస్ట్ సినిమా ‘దిల్’ రాజు సినిమానే. టైటిల్ ‘పలుకే బంగారమాయెనా’ అనుకుంటున్నాం. కథ రెడీ అవుతోంది. పక్కా నా స్టైల్ సినిమానే.
► డెహ్రాడూన్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత మహేశ్‌బాబు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నాం. ఇంద్రగంటితో ఓ మల్టీస్టారర్ సినిమా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దాగుడుమూతలు’ అనుకున్నాం. వర్క్ జరుగుతోంది. ఈ స్క్రిప్ట్ చేస్తామా? లేక వేరే చేస్తామా? అనేది ఓ పది రోజుల్లో తెలుస్తుంది. గల్లా అశోక్ సినిమా స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యింది. అక్టోబర్ లేదా సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుంది.
► ఇక సినిమాల రిలీజ్ విషయానికొస్తే... నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేస్తాం. వెంకటేశ్, వరుణ్‌తేజ్ మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ని సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నాం. రామ్ హీరోగా ‘çహలో గురు ప్రేమకోసమే’ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేస్తాం. మహేశ్ సినిమా ఏప్రిల్ 5న విడుదల అవుతుంది. మా ప్రొడక్షన్ హౌస్ ఓన్లీ టాలీవుడ్‌కే పరిమితం కాదు. 2020లో బాలీవుడ్‌లో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాం. నా విషయానికొస్తే... నో యాక్టింగ్ నో డైరెక్షన్. ఈ రెండు విషయాల్లో క్లారిటీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment