
ఎల్లా ప్రగడ గార్గేయి, రాకేశ్ వర్రె
రాకేశ్ వర్రె హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. బసవ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎల్లా ప్రగడ గార్గేయి కథానాయిక. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు విడుదల చేయనున్నారు. రాకేశ్ మాట్లాడుతూ– ‘‘హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీస్‌ను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తుంటారు. అలాంటి రొమాంటిక్ కామెడీ స్టోరీతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అభిరుచి ఉన్న నిర్మాత ‘దిల్’ రాజుగారు మా సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: శంకర్‌శర్మ, లైన్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment