
విజయ్ దేవరకొండ
హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక దర్శకునిగా శివ నిర్వాణ తెరకెక్కించిన రెండు చిత్రాలు ‘నిన్నుకోరి (2017), మజిలీ (2019)’ హిట్ సాధించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. బుధవారం (డిసెంబరు 18) నిర్మాత ‘దిల్’ రాజు పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘‘రాజుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బ్లాక్‌బస్టర్ బహుమతి లోడ్ అవుతోంది’’ అని పేర్కొన్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్, హీరో, ఫైటర్’ సినిమాలతో విజయ్ బిజీ. అలాగే నాని హీరోగా నటిస్తున్న ‘టక్ జగదీష్’తో శివ నిర్వాణ కూడా బిజీ.. సో.. వీరిద్దరు వారి వారి సినిమాలను పూర్తి చేశాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment