సాక్షి : హైదరాబాద్ : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఉంటే దేవర ఈవెంట్ ఫంక్షన్ అద్భుతంగా జరిగేదన్నారు.
బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి కేటీఆర్ ఫతేనగర్ బ్రిడ్జ్‌ని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ దేవర ప్రీ రిలీజ్ రద్దుపై మాట్లాడారు.
Jr ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి - కేటీఆర్ pic.twitter.com/0I8CGXVEjt
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు గుప్పించారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పోలీసులు చేతులెత్తేశారని, తాము అధికారికంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్లు సంతోషంగా జరుపుకునే వాళ్లని కేటీఆర్ ప్రస్తావించారు. తాము సినిమా ఫంక్షన్లతో పాటు అన్ని మతాల పండుగలను సమర్థవంతంగా నిర్వహించామని అన్నారు.
👉చదవండి : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు రద్దైంది
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని భావించింది. అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో నిర్వహాకులు ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment