తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసిన అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు, పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన అన్నారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఇండస్ట్రీతో ప్రభుత్వం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు దిల్ రాజు అన్నారు.
గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం హీరోలు, హీరోయిన్లు తమ వంతుగా పాటు పడుతారని దిల్ రాజు అన్నారు. ఐటీ, ఫార్మాతో సమానంగా సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమాలు నిర్మించేలా పాటుపడాలని సీఎం సూచించినట్లు దిల్ రాజు అన్నారు. తెలంగాణలో సామాజిక అంశాలలో నటీనటులు ఇక నుంచి పాల్గొంటారని ఆయన అన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్‌షోలు వంటి అంశాలు చాలా చిన్నవని ఆయన అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో తమ సమావేశం సానుకూలంగానే జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఇండస్ట్రీ పనిచేస్తుందని ఆయన అన్నారు. కొన్ని సంఘటనల వల్ల చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి దూరం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. త్వరలో తామందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకుని సినిమా పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అవసరాలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని ఆయన అన్నారు.
రూమర్స్‌పై స్పందించిన దిల్ రాజు..
సీఎంతో భేటీ తరువాత పలు మాధ్యమాల్లో వస్తున్న ఫేక్ వార్తలపై దిల్ రాజు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. అరశాతం కూడా నెగిటివ్ లేదని.. సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదని.. పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు చూపించలేదని అన్నారు. బౌన్సర్స్ విషయంలో ప్రతిదీ అకౌంటబిలిటీగా ఉండాలని డీజీపీ సూచించినట్లు దిల్ రాజు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment