
సాక్షి,న్యూఢిల్లీ:తాను ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడలేదని, పీఎం కుర్చీని అగౌరపర్చలేదని సీఎం రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. ‘పుట్టుకతోనే మోదీ బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన తేదీల్లో తేడా ఉంటే ఉండొచ్చు.మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి.
రాహుల్‌తో నాకు ఎలాంటి గ్యాప్ లేదు.గ్యాప్ అంతా ఊహాగానాలే. రాహుల్ గైడెన్స్‌తోనే పనిచేస్తున్నా. రాహుల్ ఎజెండాను సీఎంగా నెరవేర్చడమే నా పని. దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగణన చేశా. మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన అవకాశమిస్తున్నాం’అని రేవంత్ తెలిపారు.
కాగా,శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని కన్వర్టెడ్ బీసీ అని, పుట్టుకతో బీసీ కాదని అన్నారు.మోదీ మొదటిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది.
Comments
Please login to add a commentAdd a comment